Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌పంచ‌ మ‌హిళా బాక్సింగ్‌లో స్వర్ణం సాధించిన భార‌త అగ్ర‌శ్రేణి


బాక్స‌ర్ మేరీకోమ్‌కు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు.

ప్ర‌పంచ‌ మ‌హిళా బాక్సింగ్‌లో స్వర్ణ ప‌త‌కం సాధించిన భార‌త అగ్ర‌శ్రేణి బాక్స‌ర్ మేరీకోమ్‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు. “భార‌త క్రీడ‌రంగం గ‌ర్వించాల్సిన త‌రుణ‌మిది. ప్ర‌పంచ‌ మ‌హిళా బాక్సింగ్‌లో స్వర్ణ ప‌త‌కం సాధించిన బాక్స‌ర్ మేరీకోమ్‌కు నా అభినంద‌న‌లు. క్రీడారంగంలో ఆమె అకుంఠిత దీక్ష‌, అంత‌ర్జాతీయ య‌వ‌నిక‌పై వెలుగొందే విధంగా ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించి తీరు అంద‌రికీ స్ఫూర్తినిచ్చేవే. ఆమె విజ‌యం ఎంతో ప్ర‌త్యేకం” అని ప్ర‌ధాన‌మంత్రి కొనియాడారు.

*****