Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌పంచ జీవ ఇంధ‌న దినం 2018 సూచ‌కంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌పంచ జీవ ఇంధ‌న దినం సూచ‌కంగా 2018 ఆగ‌స్టు 10వ తేదీ న న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో నిర్వ‌హించే ఒక కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హాజ‌రు కానున్నారు.

రైతులు, శాస్త్రవేత్త‌లు, న‌వ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ప్ర‌భుత్వ అధికారులు మ‌రియు చ‌ట్ట‌స‌భ‌ ల స‌భ్యుల‌ తో కూడిన స‌భికుల‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగిస్తారు.

ముడి చ‌మురు దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డ‌డాన్ని త‌గ్గించ‌డం లో జీవ ఇంధ‌నాలు సహాయకారి కాగలవు. అవి ఒక ప‌రిశుభ్ర‌మైన ప‌ర్యావ‌ర‌ణానికి తోడ్పాటును అందించ‌గ‌ల‌వు; రైతుల‌కు అద‌న‌పు ఆదాయాన్ని సంపాయించి పెట్ట‌గ‌ల‌వు; అంతేకాక, గ్రామీణ ప్రాంతాల‌లో ఉపాధి క‌ల్ప‌న‌ కు దోహ‌దం చేయ‌గ‌ల‌వు. ఈ కార‌ణంగా స్వ‌చ్ఛ భార‌త్, రైతుల ఆదాయాల‌ను పెంపొందించ‌డం స‌హా వివిధ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌తో జీవ ఇంధ‌నాలు ముడివ‌డివున్నాయి.

కేంద్ర ప్ర‌భుత్వం కృషి ఫ‌లితంగా పెట్రోలు లో ఇథెనాల్ కలపడం అనేది 2013-14 ఇథెనాల్ సరఫరా సంవత్సరం లో 38 కోట్ల మీట‌ర్ల స్థాయి లో ఉన్నది కాస్తా 2017-18 ఇథెనాల్ సరఫరా సంవత్సరానికి దాదాపు 141 కోట్ల లీట‌ర్ల‌ కు పెరిగింది. 2018 జూన్ లో ప్ర‌భుత్వం జీవ ఇంధ‌నాల జాతీయ విధానాన్ని సైతం ఆమోదించింది.