Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌పంచ శౌచాల‌య దినం నాడు ప్ర‌ధాన మంత్రి సందేశం


ప్ర‌పంచ శౌచాల‌య దినం సంద‌ర్భం గా ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సందేశం యొక్క పాఠం ఈ కింది విధం గా ఉంది.

“నేడు- ప్ర‌పంచ శౌచాల‌య దినం సంద‌ర్భం గా- దేశం అంతటా స్వ‌చ్ఛ‌త ను, పారిశుధ్య స‌దుపాయాల‌ను పెంపొందించే దిశ‌ గా మ‌న నిబ‌ద్ధ‌త‌ ను పున‌రుద్ఘాటిద్దాం. గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల లో పారిశుధ్య సంబంధ ర‌క్ష‌ణ క‌వ‌చాన్ని మార్గ‌ద‌ర్శ‌క ప్రాయ‌మైన వేగం తో పెంపొందించుకోవ‌డం ప‌ట్ల భార‌త‌దేశం లోని మ‌న‌మంతా గ‌ర్విద్దాం.

ఒక స్వ‌చ్ఛమైనటువంటి భార‌తదేశం కోసం, ఉత్త‌మ‌ పారిశుధ్య స‌దుపాయాల‌కు పూచీ ప‌డడం కోసం జరుగుతున్నటువంటి ఉద్య‌మం ఒక ప్ర‌జా ఉద్య‌మం గా నిల‌చింది. ఈ ఉద్య‌మం లో 130 కోట్ల మంది భార‌తీయులు, మ‌రీ ముఖ్యంగా మ‌హిళ‌లు, యువ‌తీ యువ‌కులు సార‌థ్యం వ‌హించారు. ఒక ‘స్వ‌చ్ఛ్ భార‌త్’ స్వ‌ప్నాన్ని సాకారం చేయ‌డం కోసం పాటుప‌డుతున్న అంద‌రినీ నేను అభినందిస్తున్నాను’’.