పిఎంఇండియా
ఫూడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ రంగం లో భారతదేశాని కి మరియు జపాన్ కు మధ్య సహకార పూర్వక ఒప్పంద పత్రం (ఎంఒసి)కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ప్రయోజనాలు:
ఫూడ్ ప్రాసెసింగ్ రంగం లో భారతదేశాని కి మరియు జపాన్ కు మధ్య ద్వైపాక్షిక సహకారం ఉభయ దేశాల లో ఈ రంగాని కి పరస్పర ప్రయోజనకారి గా ఉండగలదు. ఇది రెండు దేశాల లో ఫూడ్ ప్రాసెసింగ్ లో అత్యుత్తమ పద్దతుల ను అవగాహన చేసుకొనేందుకు ప్రోత్సాహకారి కావడం తో పాటు విపణి లభ్యత ను మెరుగుపరచి, ఈక్విటీ కి మరియు సమ్మిళితత్వాని కి దారి తీస్తుంది. కొత్త కొత్త మెలకువల ను మరియు ప్రక్రియల ను పరిచయం చేసేందుకు కూడా ఎంఒసి బాట పరుస్తుంది. అత్యుత్తమ పద్ధతులను మరియు ఉత్తమ విపణుల ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దేశం లో ఫూడ్ ప్రాసెసింగ్ సామర్ధ్యాన్ని పెంచడం లో ఈ ఒప్పందం సహాయకారి కాగలదు.
***