పిఎంఇండియా
ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సమావేశంలో ఈ రోజు నిర్వహించిన అవుట్ రీచ్ కార్యక్రమంలో “అందరి కోసం సమతుల్యమైన, ఉమ్మడిదైన, సుస్థిరమైన ఆర్థికవృద్ధిని పునరుద్ధరించడం” అనే అంశంపై ప్రధానమంత్రి ప్రసంగించారు.
భాగస్వామ్య, సుస్థిరవృద్ధిపై శిఖరాగ్ర సమావేశం దృష్టి సారించడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. అనిశ్చితుల కారణంగా ప్రపంచం ప్రభావితమవుతున్న నేపథ్యంలో.. సుస్థిర వృద్ధిపై సందేశాన్ని ప్రపంచం స్వీకరిస్తుందని తెలిపారు. వృద్ధి అంటే జీడీపీకీ, వాణిజ్యానికీ సంబంధించిన అంకెలకే పరిమితం కాదనీ, సమ్మిళిత్వం, ప్రజా సంక్షేమంలో దాని అసలైన ప్రభావం ప్రతిబింబిస్తుందనీ తెలియజేశారు. ఈ సందర్భంగా.. ‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’’ (అందరితో కలసి, అందరికీ అభివృద్ధి, అందరి విశ్వాసం, అందరి ప్రయత్నం) అనే సూత్రం ఆధారంగా భారత్ సాధించిన సమగ్ర వృద్ధి కథనాన్ని తెలియజేశారు.
భారత్ అనుసరించే సమ్మిళిత వృద్ధి మంత్రం దేశం నిర్వహించే అంతర్జాతీయ కార్యకలాపాలకు కూడా మార్గనిర్దేశం చేస్తోందని ప్రధానమంత్రి అన్నారు. “ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు” ఇతివృత్తంతో భారత్ అధ్యక్షత వహించిన జీ20 లో స్పష్టంగా ఈ విధానం కనిపిస్తుందన్నారు. సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికీ, పెట్టుబడులు–ఉపాధి అవకాశాలను సృష్టించడానికీ, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికీ రూపొందించిన ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ)కు కూడా ఈ తరహా విధానమే మార్గదర్శకంగా నిలిచిందని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలపై సంక్షోభాలు, ఘర్షణలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయని చెబుతూ.. ఆ దేశాలపై పడిన భారాన్ని తగ్గించడానికి అంతర్జాతీయ సంఘీభావం అవసరమని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థిరత్వాన్ని చేకూర్చేలా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సహాయక యంత్రాంగాలను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ఐఎంఈసీ మాదిరిగానే ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పసిఫిక్ ద్వీప దేశాలను అనుసంధానించే ప్రాజెక్టులను కూడా పరిశీలించాలని ఆయన కోరారు. ఈ లక్ష్యాన్ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు జీ-7 దేశాల పెట్టుబడులనూ, భారత దేశ ప్రతిభనూ, గ్లోబల్ సౌత్ దేశాల యాజమన్యాన్నీ మిళితం చేసేలా ఇంటర్నేషనల్ మొబిలైజేషన్ పార్టనర్‌షిప్ ఫర్ యాక్సిలరేటింగ్ కనెక్టివిటీ అండ్ ట్రేడ్ లేదా ఇంపాక్ట్ పేరిట భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాని ప్రధానమంత్రి ప్రతిపాదించారు.
స్థిరమైన, విశ్వసనీయమైన, సుభిక్షమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడంలో భారతదేశానికున్న చిత్తశుద్ధిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. అలాగే సమగ్రత, భాగస్వామ్యం, ఉమ్మడిగా సాధించే ప్రగతిపై ఉన్న విశ్వాసమే జీ-7 సభ్యదేశాలతో, అనేక ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదర్చుకొనేలా ముందుకు నడిపిస్తోందని తెలియజేశారు.
***
At the G7 Summit in Evian, addressed the Outreach Session on ‘Reviving a Balanced, Shared and Sustainable Economic Growth for All.’ It is good that the French G7 Presidency has given importance to this topic.
— Narendra Modi (@narendramodi) June 17, 2026
The reality today is- when it comes to growth, the question should… pic.twitter.com/qGQpCLbQPA
Like the vision of IMEC, can we work on connectivity projects with countries in Africa, Latin America and the Pacific Islands?
— Narendra Modi (@narendramodi) June 17, 2026
By combining G7 capital, India’s talent and the ownership of Global South countries, we may also consider establishing an International Mobilisation…
Today, many societies are becoming ageing societies while India and other countries of the Global South have abundance of young talent, entrepreneurship and skills.
— Narendra Modi (@narendramodi) June 17, 2026
To harness this natural complementarity, called for the creation a Global Skills Partnership, where we can work…