Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బలిస్టిక్ క్షిపణి రక్షక సామర్థ్యాన్ని విజయవంతంగా చాటిచెప్పిన రక్షణ శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి అభినందించారు


భారతదేశ బలిస్టిక్ క్షిపణి యొక్క రక్షక సామర్థ్యాన్ని విజయవంతంగా చాటిన సందర్భంగా రక్షణ శాస్త్రవేత్తలను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

“బలిస్టిక్ క్షిపణి రక్షక సామర్థ్యాన్ని జయప్రదంగా చాటిచెప్పిన సందర్భంగా మన రక్షణ రంగ శాస్త్రవేత్త లకు హృద‌యపూర్వక అభినందనలు.
దీనితో, ఈ తరహా సామర్థ్యాన్ని కలిగివున్న అయిదు దేశాల బృందంలో భారతదేశం చేరినట్లయింది; ఇది యావత్తు దేశం గర్వించదగిన సమ యం” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***