పిఎంఇండియా

శ్రేష్ఠురాలు బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గారు,
భారతదేశం మరియు బాంగ్లాదేశ్ ల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు,
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు,
త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ బిప్లబ్ కుమార్ దేబ్,
కొద్ది రోజుల క్రితం కాఠ్‌మాండూ లో బిఐఎమ్ఎస్‌టిఇసి (బిమ్స్ టెక్) శిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో శేఖ్ హసీనా గారి తో నేను భేటీ అయ్యాను. అంతకన్నా ముందు, ఏప్రిల్ నెల లో లండన్ లో కామన్‌వెల్త్ శిఖర సమ్మేళనం లోను మరియు మే నెల లో శాంతినికేతన్ లోను కూడా మేము సమావేశమయ్యాము.
ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీ తో మరో సారి భేటీ అయ్యే అవకాశం ఈ రోజున నాకు లభించినందుకు నేను సంతోషిస్తున్నాను.
పొరుగు దేశాల తో సంబంధం అనేది ఇరుగు పొరుగు ల మధ్య మాదిరి గా సన్నిహితం గా ఉండాలంటూ నేను ఇదివరకు అనేక పర్యాయాలు నొక్కి పలికాను. మనం అనుకొన్నప్పుడల్లా ఒకరితో మరొకరం మాట్లాడుకోవచ్చు లేదా ఒకరి తో మరొకరు భేటీ కావచ్చు. ఇటువంటి విషయాల కోసం మనం ప్రోటోకాల్స్ కు బంధించబడి ఉండకూడదు.
ఈ విధమైన సంబంధాన్ని ప్రధాని శేఖ్ హసీనా గారు కొనసాగిస్తున్నారని నాకు స్పష్టంగా తోస్తున్నది. పలు మార్లు జరిగిన భేటీ లు కాక, ఇది మన నాలుగో వీడియో కాన్ఫరెన్స్. అంతేకాదు, అతి త్వరలోనే మరొక వీడియో కాన్ఫరెన్స్ ను కూడా నిర్వహించుకోనున్నాము.
ఈ వీడియో కాన్ఫరెన్స్ ల తాలూకు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇరు దేశాల సంయుక్త పథకాల ప్రారంభ కార్యక్రమాలకు విఐపి సందర్శనల ఆవశ్యకత ఉండబోదు.
ఎక్స్‌లెన్సీ, సంధానాన్ని గురించి మనం మాట్లాడుకొన్నప్పుడల్లా 1965 సంవత్సరాని కన్నా పూర్వపు మన దార్శనికత ను పునరుద్దరించుకోవాలని నేను ఎల్లప్పటికీ భావిస్తూ వుంటాను. ఈ దిశగా గత కొన్ని సంవత్సరాలుగా మనం చర్యలు తీసుకొంటూ వున్నామని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.
ఈ రోజున మనం మన విద్యుత్తు సంధానాన్ని పెంపొందించుకున్నాము. అలాగే, రైల్వే సంధానాన్ని విస్తృతం చేసుకోవడం కోసం రెండు పథకాలను మనం ప్రారంభించుకొన్నాము.
2015వ సంవత్సరం లో నేను బాంగ్లాదేశ్ ను సందర్శించినప్పుడు 500 మెగావాట్ ల అదనపు విద్యుత్తు ను బాంగ్లాదేశ్ కు సరఫరా చేయాలని మనం నిర్ణయం తీసుకొన్నాము. ఆ విధంగా, ఈ పనికి గాను బాంగ్లాదేశ్ నుండి ఉన్నటువంటి ట్రాన్స్‌మిశన్ లింక్ ను పశ్చిమ బెంగాల్ లో ఉపయోగించుకోవడం జరుగుతోంది. ఈ పని కి మద్దతిచ్చినందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారిని నేను అభినందిస్తున్నాను.
ఈ పథకం పూర్తి కావడం తో, 1.16 గీగావాట్ల విద్యుత్తు ను భారతదేశం నుండి బాంగ్లాదేశ్ కు సరఫరా చేయడం జరుగుతోంది. మెగావాట్ నుండి గీగావాట్ స్థాయి కి పురోగమించడం మన సంబంధాల లో సువర్ణ అధ్యాయానికి ఒక సంకేతం అని నేను నమ్ముతున్నాను.
రైల్వేల రంగం లో కూడా మన సంధానం మెరుగుపడుతోంది. మన సహకారం లో బాంగ్లాదేశ్ తో అంతర్గత సంధానం మరియు భారతదేశం తో సంధానం కీలకాంశాలు గా ఉన్నాయి.
అఖౌరా- అగర్ తలా సంధానం ఒకసారి పూర్తి అయిందంటే, మన సీమాంతర సంధానానికి మరొక లంకె ను జోడించడం జరుగుతుంది. ఈ పథకం లో సహకారానికి గాను ముఖ్యమంత్రి శ్రీ బిప్లబ్ కుమార్ దేబ్ ను నేను అభినందిస్తున్నాను.
బాంగ్లాదేశ్ అభివృద్ధి కై మహత్వాకాంక్ష కలిగిన లక్ష్యాలను.. అంటే 2021వ సంవత్సరానికల్లా మధ్యాదాయ దేశం గాను, అలాగే 2041వ సంవత్సరానికల్లా అభివృద్ధి చెందినటువంటి దేశం గాను తయారు కావాలని.. ప్రధాని శేఖ్ హసీనా గారు నిర్దేశించారు. ఈ దార్శనికత సఫలం కావడం లో తోడ్పాటు ను అందించడం మరియు సహాయం చేయడం మాకు గొప్ప గర్వకారకమైనటువంటి విషయం.
ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా మనం మన సంబంధాలను వర్ధిల్లేటట్లు చేసుకొంటామని, వృద్ధి లో, సమృద్ధి లో కొత్త శిఖరాలను అందుకోగలమని నాకు పూర్తి నమ్మకం ఉంది.
ఈ పని కి మద్దతు ఇచ్చినందుకు మరియు నేటి కార్యక్రమానికి హాజరైనందుకు ప్రధాని శేఖ్ హసీనా గారి కి, పశ్చిమ బెంగాల్, త్రిపుర ల ముఖ్యమంత్రుల కు నేను నా హృదయపూర్వక కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను.
మీకు ఇవే ధన్యవాదాలు.
PM Sheikh Hasina and PM @narendramodi are jointly inaugurating various projects. Watch PM’s speech. https://t.co/sykt6p4TR7
— PMO India (@PMOIndia) September 10, 2018
Brightening lives, furthering connectivity and improving India-Bangladesh friendship.
— Narendra Modi (@narendramodi) September 10, 2018
PM Sheikh Hasina and I jointly inaugurated three development projects. West Bengal CM @MamataOfficial Ji and Tripura CM @BjpBiplab Ji joined the programme as well. https://t.co/YcfiLMuKao pic.twitter.com/b0QEFrbRPU