Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బాంబే ఆర్ట్ సొసైటీ నూత‌న భ‌వ‌న స‌ముదాయాన్ని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

బాంబే ఆర్ట్ సొసైటీ నూత‌న భ‌వ‌న స‌ముదాయాన్ని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు బాంబే ఆర్ట్ సొసైటీ నూత‌న భ‌వ‌న స‌ముదాయం ప్రారంభ సూచ‌కంగా ఒక ఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ, మూడు శ‌తాబ్దాల కాలం పాటు త‌న ప్ర‌భావాన్ని ప్ర‌సరించిన సంస్థ అరుదుగా ఉంటుంద‌న్నారు. బాంబే ఆర్ట్ సొసైటీ 19వ శ‌తాబ్దం చివ‌ర‌లో ఆరంభ‌మైన‌ప్ప‌టి నుంచి అలా త‌న ప్ర‌భావాన్ని ప్ర‌స‌రించింద‌న్నారు. ఇందుకు కార‌ణం క‌ళ త‌న‌దైన శ‌క్తిని, సందేశాన్ని క‌లిగి ఉండ‌డ‌మేన‌ని ఆయ‌న అన్నారు.

క‌ళ అనేది కేవ‌లం గోడ‌ల‌ పైన‌ అలంక‌ర‌ణ‌ కోస‌మే కాద‌ని, అది స‌మాజానికి ఊతంగా నిల‌బ‌డే ఒక స్తంభ‌మ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. పిల్ల‌ల వ్య‌క్తిత్వం స‌ర్వ‌తోముఖంగా అభివృద్ధి చెంద‌డంలో ఒక ముఖ్య‌మైన పాత్ర‌ను క‌ళ పోషించ‌గ‌ల‌ద‌ని ఆయ‌న తెలిపారు. ఈ యంత్ర యుగంలో సైతం వ్య‌క్తుల‌లో మాన‌వత‌ను స‌జీవంగా ఉంచ‌డంలో క‌ళ తోడ్ప‌డుతుంద‌న్నారు.

క‌ళ ఎప్ప‌టికీ సంస్థ‌ పైన‌ ఆధార‌ప‌డి ఉండ‌కూడ‌దు, దానిని సంస్థ‌ త‌ప్ప‌క‌ సంర‌క్షించి తీరాల‌న్నారు.

క‌ళ (ఆర్ట్) అనే ప‌దంలో భాగాలైన ఎ, ఆర్, టి అనే మూడు అక్ష‌రాల‌ను గురించి వివ‌రంగా చెబుతూ, ఆ అక్ష‌రాలు వార్ధ‌క్య రాహిత్యం, జాతి రాహిత్యం, ప్రాంతీయ రాహిత్యం, ఇంకా శాశ్వ‌త‌త్వం అనే గుణాల‌ను సూచిస్తాయ‌ని, ఈ గుణాల‌న్నీ క‌ల‌సి క‌ళ‌ను నిర్వ‌చిస్తాయ‌న్నారు.

ఏదైనా క‌ళాకృతిని సృజించే ప్ర‌క్రియ‌ను వివ‌రించ‌డానికి డిజిట‌ల్ సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవాల‌ని ప్ర‌ధాన మంత్రి సూచించారు. ఈ ప‌ద్ధ‌తి క‌ళాకారుడి ఆలోచ‌చ‌న‌ల తీరును అర్ధం చేసుకోవ‌డానికి ప్ర‌జ‌ల‌కు స‌హాయ‌కారి కాగ‌ల‌ద‌ని ప్ర‌ధాన మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు.