పిఎంఇండియా
డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ను అభివృద్ధి పరచేందుకు బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) ఇంటర్ బ్యాంక్ కో ఆపరేశన్ మెకానిజమ్ లో భాగంగా ఎక్స్పోర్ట్- ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంకు) ఆధ్వర్యం లో బ్రిక్స్ లోని ఇతర సభ్యత్వ బ్యాంకులతో డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జెర్ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ తాలూకు సహకార పూర్వక పరిశోధన సాగే అంశం పై ఒక అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎంఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. సభ్యత్వ బ్యాంకుల లో Banco Nacional de DesenvolvimentoEconomico e Social (BNDES, of Brazil), స్టేట్ కార్పొరేశన్ బ్యాంక్ ఫర్ డివెలప్మెంట్ అండ్ ఫారిన్ ఎకనామిక్ ఎఫైర్స్ (Vnesheconombank, of Russia), చైనా డివెలప్మెంట్ బ్యాంక్ (సిడిబి) మరియు డివెలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సదరన్ ఆఫ్రికా (డిబిఎస్ఎ) లు ఉన్నాయి.
ప్రధాన ప్రభావం:
బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) దేశాల లోని ఆర్థిక రంగాలు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్ళ కు పరిష్కారాల ను సూచించే సామర్ధ్యం డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్/ బ్లాక్ చైన్ టెక్నాలజీ కి ఉంది. సంయుక్త పరిశోధన లను చేపట్టడం ద్వారా డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ /బ్లాక్ చైన్ టెక్నాలజీ సంబంధిత అవగాహన ను పెంపొందించడం ఈ ఎంఒయు ఉద్దేశంగా ఉంది. కార్యకలాపాల లో దక్షత ను వృద్ధి పరచేందుకు తగిన అప్లికేశన్ లను రూపొందించడం కోసం ఈ ఎంఒయు ను సంకల్పించారు.
పూర్వరంగం:
బ్రిక్స్ దేశాల నేతలు డిజిటల్ ఎకానమీ పై చైనా లో సంతకాలు చేసిన శియామెన్ ప్రకటన డిజిటల్ ఎకానమీ యొక్క ప్రాముఖ్యాన్ని స్పష్టం చేసింది. ప్రవర్ధమానమవుతున్న మరియు గతిశీలమైన డిజిటల్ ఎకానమి ప్రపంచ ఆర్థికాభివృద్ధి కి ఊతంగా నిలచి ప్రతి ఒక్కరికి ప్రయోజనాలను అందించగలుగుతుంది. కాబట్టి, దీనిని బ్రిక్స్ సభ్యత్వ దేశాలు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చనేది ఈ ప్రకటన వివరిస్తుంది. దీనికి అనుగుణంగా కొలాబరేటివ్ రిసర్చ్ ఆన్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇన్ ది కాన్టెక్స్ట్ ఆఫ్ ది డివెలప్మెంట్ ఆఫ్ ది డిజిటల్ ఎకానమి పై అన్ని సభ్యత్వ బ్యాంకులు ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రాన్ని (ఎంఒయు ను) కుదుర్చుకోవాలని సూచించడం జరిగింది.