Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిహార్‌లో రైల్వే వంతెన‌ల నిర్మాణ ప్రాజెక్టుల‌కోసం శిలాఫ‌ల‌కాల్ని ఆవిష్క‌రించిన ప్ర‌ధాని

బిహార్‌లో రైల్వే వంతెన‌ల నిర్మాణ ప్రాజెక్టుల‌కోసం శిలాఫ‌ల‌కాల్ని ఆవిష్క‌రించిన ప్ర‌ధాని


బీహార్ రాజ‌ధాని ప‌ట్నాలో నూత‌నంగా నిర్మించిన రైల్ క‌మ్ రోడ్డు బ్రిడ్జిని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ జాతికి అంకింతం చేశారు. దీనికి సంబంధించిన కార్య‌క్ర‌మం హాజిపూర్‌లో జ‌రిగింది. ముంగేర్ ద‌గ్గ‌ర కొత్త‌గా నిర్మించిన రైల్ క‌మ్ రోడ్డు బ్రిడ్జిపైన గూడ్స్ రైళ్ల రాక‌పోక‌ల్ని ప్రారంభించిన‌ ప్ర‌ధాని అందుకు సంబంధించిన‌ శిలాఫ‌ల‌కాల‌ను ఆవిష్క‌రించారు. రాజేంద్ర పుల్ ద‌గ్గ‌ర మొకామా వ‌ద్ద అద‌నంగా నిర్మిస్తున్న‌ వంతెన‌కు ప్ర‌ధాని శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన‌ స‌భ‌లో మాట్లాడిన ప్ర‌ధాని కొత్త‌గా జాతికి అంకితం చేసిన వంతెన ఈ ప్రాంతంలో ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను, ఇక్క‌డి ప్ర‌జ‌ల ఆర్థిక ప‌రిస్థితిని మెరుగుప‌రుస్తుంద‌ని అన్నారు. శ్రీ అట‌ల్ బిహారీ వాజ్ పేయి ప్ర‌ధానిగా ఉండ‌గా, ప్ర‌స్తుత బిహార్ సీఎం నితీష్‌కుమార్ రైల్వేశాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన‌ స‌మ‌యంలో ఈ వంతెన‌కు శంకుస్థాప‌న చేయ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాని గుర్తు చేశారు.
దేశం సుస్థిరంగా అభివృద్ధి సాధించాలంటే తూర్పు ప్రాంత‌ రాష్ట్రాల అభివృద్ధి త‌ప్ప‌నిస‌ర‌ని ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు. భార‌త‌దేశ అభివృద్ధిలో తూర్పుభార‌తం కీల‌క పాత్ర పోషిస్తుంద‌న్న‌ ఆయ‌న దేశం అభివృద్ధి సాధించాలంటే బిహార్ త‌ప్ప‌కుండా అభివృద్ధి చెందాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మౌళిక‌వ‌సతుల్ని ముఖ్యంగా త‌గిన‌న్ని ర‌హ‌దారులు, రైల్వే మార్గాల్ని ఏర్పాటు చేసుకుంటే అవి దేశాభివృద్ధి దోహ‌దం చేస్తాయ‌ని త‌ద్వారా ప్ర‌గ‌తి పుంజుకుంటుంద‌ని ప్ర‌ధాని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా రైల్వే రంగం పూర్తిగా ఆధునీక‌ర‌ణ చెందాల‌ని ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు.