Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బీహార్‌లోని లఖిసరాయ్‌లో జరిగిన దుర్ఘటన బాధితులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్–గ్రేషియా ప్రకటించిన ప్రధానమంత్రి


బీహార్‌లోని లఖిసరాయ్‌లో జరిగిన విషాద ఘటన బాధితులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్–గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని అందజేస్తామని పీఎం తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘బీహార్‌లో లఖిసరాయ్‌లో జరిగిన దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్‌ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌–గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందుతుంది.’’