Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బీహార్‌లోని వైశాలిలో పడవ మునిగిన ఘటనలో మృతుల పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి… ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పీఎం


బీహార్‌లోని వైశాలిలో పడవ మునిగిన ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతిని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు స్థానిక పరిపాలన వ్యవస్థ సహాయం అందిస్తోందని చెప్పారు.

ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

“బీహార్‌లోని వైశాలిలో పడవ ప్రమాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరం. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. బాధితులకు స్థానిక పరిపాలన వ్యవస్థ సహాయం అందిస్తోంది.

పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబసభ్యులకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందిస్తాం:  PM @narendramodi “