Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బీహార్ వ‌ర‌ద‌బాధిత ప్రాంతాల్లో ప్ర‌ధాన‌మంత్రి గ‌గ‌న‌త‌ల ప‌రిశీల‌న;రూ.500 కోట్ల త‌క్ష‌ణ స‌హాయం ప్ర‌క‌ట‌న‌

బీహార్ వ‌ర‌ద‌బాధిత ప్రాంతాల్లో ప్ర‌ధాన‌మంత్రి గ‌గ‌న‌త‌ల ప‌రిశీల‌న;రూ.500 కోట్ల త‌క్ష‌ణ స‌హాయం ప్ర‌క‌ట‌న‌

బీహార్ వ‌ర‌ద‌బాధిత ప్రాంతాల్లో ప్ర‌ధాన‌మంత్రి గ‌గ‌న‌త‌ల ప‌రిశీల‌న;రూ.500 కోట్ల త‌క్ష‌ణ స‌హాయం ప్ర‌క‌ట‌న‌

బీహార్ వ‌ర‌ద‌బాధిత ప్రాంతాల్లో ప్ర‌ధాన‌మంత్రి గ‌గ‌న‌త‌ల ప‌రిశీల‌న;రూ.500 కోట్ల త‌క్ష‌ణ స‌హాయం ప్ర‌క‌ట‌న‌


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ బీహార్‌లో వ‌ర‌ద ముంపు ప్రాంతాల‌ను గ‌గ‌న‌త‌లం నుంచి ప‌రిశీలించారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి శ్రీ నితీష్‌కుమార్‌, ఉప ముఖ్య‌మంత్రి శ్రీ సుశీల్ మోదీ, రాష్ట్ర సీనియ‌ర్ అధికారుల‌తో పూర్ణియా జిల్లా కేంద్రంలో స‌మావేశ‌మై స‌హాయ‌, పున‌రావాస‌, న‌ష్ట ప‌రిహార చెల్లింపు చ‌ర్య‌ల గురించి స‌మీక్షించారు. అటుపైన రూ.500 కోట్ల త‌క్ష‌ణ స‌హాయం ప్ర‌క‌టించ‌డంతోపాటు రాష్ట్రానికి సాధ్య‌మైనంత మేర స‌హాయ, స‌హ‌కారాలు అందిస్తామ‌ని ప్ర‌ధాన‌మంత్రి హామీ ఇచ్చారు. వ‌ర‌ద న‌ష్టాల‌ను అంచ‌నావేసి, స‌హాయ ప‌రిమాణాన్ని నిర్ణ‌యించేందుకు త్వ‌ర‌లోనే కేంద్ర బృందం రాష్ట్రాన్ని సంద‌ర్శిస్తుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి హామీ ఇచ్చారు. వర‌ద ముంపు ప్రాంతాల‌లో పంటల బీమాకు సంబంధించి రైతుల విజ్ఞ‌ప్తుల ప‌రిశీల‌న‌, సాధ్య‌మైనంత త్వ‌ర‌గా వారికి ప‌రిహారం చెల్లింపు దిశ‌గా ప‌రిశీల‌కుల‌ను త‌క్ష‌ణ‌మే పంపాల‌ని బీమా సంస్థ‌లను ఆయ‌న ఆదేశించారు. అలాగే వ‌ర‌ద‌ల‌వ‌ల్ల ధ్వంస‌మైన ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌తుల‌కు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా కేంద్ర ర‌హ‌దారులు, ఉప‌రిత‌ల ర‌వాణా మంత్రిత్వ శాఖ‌ను ఆదేశించారు. వ‌ర‌ద‌ల ప్ర‌భావంతో దెబ్బ‌తిన్న విద్యుత్ మౌలిక స‌దుపాయాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు కేంద్రం వీలైన‌న్ని అన్ని మార్గాల్లో స‌హాయప‌డుతుంద‌ని హామీ ఇచ్చారు. వ‌ర‌ద‌బాధిత ప్రాంతాల్లో మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌లు, తీవ్రంగా గాయ‌ప‌డిన‌వారికి రూ.50వేల వంతున ఆర్థిక స‌హాయం ప్ర‌క‌టించారు. కాగా, సప్త‌కోశి హై డ్యామ్ ప్రాజెక్ట్‌, సుంకోశి రిజ‌ర్వాయ‌ర్‌-మ‌ళ్లింపు ప‌థకాల‌పై స‌మ‌గ్ర ప్రాజెక్టు నివేదిక‌ను వీలైనంత త్వ‌ర‌గా రూపొందించ‌డంపై ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, నేపాల్ ప్ర‌ధాని శ్రీ షేర్ బ‌హ‌దూర్ దేవోబా ఏకాభిప్రాయానికి వ‌చ్చారు. దీంతోపాటు నీటి ముంపు, వ‌ర‌ద‌ల నియంత్ర‌ణలో మ‌రింత స‌మ‌న్వ‌యానికి భార‌త్‌-నేపాల్ అంగీక‌రించాయి. దీనివ‌ల్ల ఈ ప్రాంతమంత‌టా వ‌ర‌ద‌ నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌కు కొత్త ఊపు ల‌భిస్తుంది.