Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బెంగళూరులోని జిగాని లో ఫ్రాంటియర్స్ ఇన్ యోగా అండ్ ఇట్స్ అప్లికేషన్స్ పై జరిగిన అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని

బెంగళూరులోని జిగాని లో ఫ్రాంటియర్స్ ఇన్ యోగా అండ్ ఇట్స్ అప్లికేషన్స్ పై జరిగిన అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని

బెంగళూరులోని జిగాని లో ఫ్రాంటియర్స్ ఇన్ యోగా అండ్ ఇట్స్ అప్లికేషన్స్ పై జరిగిన అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని

బెంగళూరులోని జిగాని లో ఫ్రాంటియర్స్ ఇన్ యోగా అండ్ ఇట్స్ అప్లికేషన్స్ పై జరిగిన అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని

బెంగళూరులోని జిగాని లో ఫ్రాంటియర్స్ ఇన్ యోగా అండ్ ఇట్స్ అప్లికేషన్స్ పై జరిగిన అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని

బెంగళూరులోని జిగాని లో ఫ్రాంటియర్స్ ఇన్ యోగా అండ్ ఇట్స్ అప్లికేషన్స్ పై జరిగిన అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని


బెంగళూరులోని జిగాని లో ఫ్రాంటియర్న్ ఇన్ యోగా అండ్ ఇట్స్ అప్లికేషన్స్ పై జరిగిన అంతర్జాతీయ సమావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రాంభించారు. ఈ యోగా కేంద్రానికి అనుబంధంగా ఒక ఆసుపత్రి నిర్మాణం పనులకు కూడా ప్రధాని శ్రీకారం చుట్టారు.

ప్రధాని ప్రారంభోపన్యాసం పాఠం కింది విధంగా ఉంది :

కర్నాటక గవర్నర్ శ్రీ వజూభాయ్ వాలా, ముఖ్యమంత్రి శ్రీ సిద్దరామయ్య, మంత్రి వర్గ సహచరులు, డాక్టర్ నాగేంద్ర, వేదికపై ఉన్న ప్రతినిధులు, మాన్య అతిథులు, యోగా ఔత్సాహికులారా..

21వ అంతర్జాతీయ సమావేశంలో పాల్గొంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది.. ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంలో వివేకానంద యోగా అనుసంధాన్ సంస్థాన్ చేసిన కృషి కి ధన్యవాదాలు.

భారత్ తో పాటు పశ్చిమ దేశాల ఆలోచనా విధానాలను కూడా కూలంకషంగా అధ్యయనం చేసిన మహా వ్యక్తి వివేకానందుడు. వేదాంతం, తత్వశాస్త్రం, విజ్ఞానం ఆధారంగా చైతన్యాన్ని పొందిన వివేకానంద భారతావనిలో ఆద్యాత్మికతను పునరుజ్జీవింప చేశారు. అంతే కాదు, మన ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని ప్రపంచం ముందుంచారు. సమాజలోని భిన్న కోణాలపై సమగ్ర అవగాహన కలిగి, ప్రపంచ ఐక్యత కోసం పాటుపడ్డారు. ఈ సంవత్సరం యోగా సైన్స్ కు ప్రత్యేకంగా నిలుస్తుంది.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 192 దేశాలలోని ఒక మిలియన్ మంది ప్రజలు గత జూన్ 21న పాటించారు. అంతర్జాతీయ స్థాయిలో యోగాకు ఆదరణ పెరుగుతోంది. ఆరోగ్యానికి యోగా ఒక చిహ్నం అన్న అభిప్రాయం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడింది. ప్రకృతికి, మనిషికి మధ్య సమతుల్యతను, పలు దేశాల మధ్య సమన్వయాన్ని, ఐక్యతను సాధిస్తుందన్న అభిప్రాయం ఉంది. వివిధ సంస్కృతులకు సంబంధించిన వారు తమ సరిహద్దులను దాటి ఐక్యంగా ఉండేలా చేస్తోంది. అదే దాని సామర్థ్యం కూడా. యోగా శాస్త్రం మానవాళిని ఏకంగా ఉంచగలుగుతోంది.

సమాజంలో యోగాకున్న ప్రాధాన్యం, శక్తి కారణంగా 2014 సెప్టెంబరు 14న నా ప్రతిపాదనను ఐక్యరాజ్కసమితి సాధారణ సభ ముందుంచాను. ప్రపంచానికి బంగారు భవిష్యత్తు, సంతోషంగా జీవించే ప్రజలు ఎంతో అవసరం. యోగా సాధన ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో కలిగే మార్పు వ్యక్తిగతంగానే కాకుండా దేశాలపై కూడా ప్రభావం చూపగలదు. ప్రపంచ దేశాలకు ఇది అత్యంత ప్రధానం. ప్రపంచంలోనే యోగాకు మంచి గుర్తింపు లభించింది. వివిధ సంస్కృతులను సంప్రదాయాలను పాటించే వారు జీవితాలను చక్కగా మలుచుకునేందుకు యోగా ఉపయోగపడుతోంది. తమ అంతరంగాలను, బాహ్య ప్రపంచాన్ని తెలుకునేందుకు దోహదపడుతోంది. నాన్ కమ్యూనికబుల్ రోగాల వల్లే ప్రపంచంలోఅత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని డబ్ల్యూహెచ్వో సంస్థ ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో 2008 లో 80 శాతం మరణాలు వీటి మూలంగానే నమోదు అయ్యాయి. 2030 నాటికి తక్కువ ఆదాయం కలిగిన దేశాలలో మరణాల శాతం ఎనిమిదింతలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. భారత్లో హృదయ నాళికామయ (కార్డియోవాస్కులార్) రోగాలు, కేన్సర్, శ్వాసకోశ సంబంధ రోగాలు, నాన్ కమ్యూనికబుల్ రోగాల వల్ల 60 శాతం మంది మరణిస్తున్నారు. ఇందులో ఆసుపత్రులలో 40 వాతం, ఓపీ రోగులుగా 35 వాతం మంది కన్ను మూస్తున్నారు. ఈ రోగాల వల్ల ఎంతో విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. వీటి ప్రభావం వైద్య రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

నాన్ కమ్యూనికబుల్ రోగాలు, మానసిక రోగాల వల్ల 2030లోగా 4.58 ట్రిలియన్ డాలర్ల నిధిని భారత్ కోల్పోయే ప్రమాదముంది. అందువల్ల ఈ సమస్య పరిష్కారానికి భౌతిక, వస్తువులకు ప్రాధాన్యం ఇచ్చే జీవనశైలి నుంచి వైదొలగాలి. యోగా పాత్ర ఇక్కడే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. యోగాసాధన వల్ల లాభపడిన వారి గాథలు, ఆశలు రేకెత్తించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయంలో శ్రీ అరవిందో భాష్యం నిజమవుతోంది. డైనమిక్ ఎలిమెంట్సు కలిగిన యోగా భావి సమాజం అవసరాలను తీరుస్తుందని ఏనాడో ఆయన భాష్యం చెప్పారు. యోగా ఒక వైద్యం కాదు. ప్రతి ఒక్కరిలో భౌతిక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మికతను రగుల్కొలిపి ఆరోగ్య ఫలితాలను ఇచ్చేది.. యోగా విధి విధానాలు ప్రస్తుత సమాజానికి బాగా ఉపకరిస్తాయి.. రోగాలు రాకుండా చూడటం, వచ్చిన తరువాత వాటి నిరోధానికి చర్యలు తీసుకోవడంలో తగిన సంతృప్తి ఉండదు. మైండ్, బాడీ , స్పిరిట్ మధ్య సమతుల్యతను పాటించాలన్న డిమాండు ఇపుడు ఉంటోంది. హోలిస్టిక్ ట్రీట్మెంటు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. సామాజికంగా, భౌతికంగా, మానసికంగా ప్రతి మనిషి బాగా ఉండాలని కాంక్షిస్తున్నారు. రోగం వచ్చినపుడు మందులు వేసుకోవడం కంటే ముందుగా జాగ్రత్తపడి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మంచిది. ఈ విషయంలో భారతీయ విధానాలు అనాదిగా వస్తున్నాయి. మనసుకు, భౌతికంగా వచ్చే రోగాల మధ్య లంకెను కనిపెట్టేదే యోగా. రోగాలకు గల కారణాలను లోతుగా అద్యయనం చేసి కనిపట్టేదే భారతీయ వైద్య విద్య. కేవలం గుర్తులు చూసి మందులిచ్చే విధానం కాదు. యోగాలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

సంప్రదాయ విజ్ఞానం గురించి ఈ రోజు సైన్స్ కాంగ్రెస్లో ప్రస్తావించా.. ప్రకృతి, మానవ అనుభవాలతోనే సైన్స్ అభివృద్ధి చెందింది. అది కేవలం నాలెడ్జ్ తోటే వచ్చిందన్న అభిప్రాయం మంచిది కాదు. భారతీయ వైద్య విధానాలు పశ్చిమ దేశ వైద్య విధానాల కన్నా మౌలికంగా భిన్నం కావు. ఈవిషయాన్ని హిపోక్రేట్స్ నుంచి పెర్సివెల్, ఎడిసిన్ ల దాకా పరిశీలిస్తే గ్రహించవచ్చు. అనుభవ రీత్యా వచ్చిన అభిప్రాయాలను ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని జోడించి సత్ఫలితాలు సాధ్యమయ్యేలా చూడాల్సిన అగత్యం ఉంది. ఆయుష్ వైద్య విధానంపై ప్రజలలో అవగాహన , ఆమోదం లభించేలా చూడాలి.. అమలు జరిగేలా చేయాలి.. దేశీయ వైద్య విధానాల వల్ల ఖర్చుతగ్గుతుంది. స్థానిక పద్ధతులకు విలువ ఇ చ్చినట్లువుతుంది. ఒక వైద్య విధానం కంటే మరో వైద్య విధానం గొప్పని చెప్పడానికి నేను ఇక్కడి రాలేదు. భిన్నత్వం కంటే మానవ సంపదే గొప్ప అని విశ్వపించే వ్యక్తిని . నాగరికతలు, భిన్న సంస్కృతుల వల్ల ఆయా దేశాలు అభివృద్ధి చెందాయి. విజ్ఞానాన్ని పంచడం ద్వారా సమాజం అభివృద్ధి కావాలి. తూర్పు-పడమర దిశలలోఉత్తమమైన విజ్ఞానాన్ని మేళవించి ఉపయోగించాలని స్వామి వివేకానంద చెప్పారు. ఇదే పద్ధతిని వైద్యరంగానికి వర్తింపచేయాలి.. యోగా, నేచరోపతి, యూనానీ, సిద్ధ, హోమియోపతి, ఆధునిక వైద్య రంగానికి సంబంధించిన ప్రముఖులను, నిపుణులను ఒకే వేదికపైకి చేర్చేప్రయత్నాలను నేను సమర్థిస్తున్నా. డయాబెటిక్, కేన్సర్, సైకియాట్రిక్, కార్డియోవాస్కులార్ హైపర్ టెన్షన్ రోగాలు, వైకల్యాలపై పరిశీలన జరగాలి. ఆధునిక యుగంలో రోగాల పరిశీలన పేరుతో జరిగే డయాగ్నోసిస్లు హెల్త్ కేర్ను పూర్తిగా మార్చి వేశాయి. ఆధునిక వైద్యం వల్ల రోగాలు ఎలా పుట్టుకొస్తున్నాయన్న సంగతి తెలుస్తోంది. వాక్సిన్లు, మందుల వినియోగం వల్ల రోగాలు చాల వరకు అదుపులోకి వస్తున్నాయి..అయితే ఆధునిక వైద్యం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువవుతున్నాయి. ఆధునిక వైద్యం ఖర్చు కూడా చాల వరకు పెరిగింది. ఈనేపథ్యంలో యోగాకు ప్రాధాన్యం హెచ్చింది. సంప్రదాయ భారతీయ మందులను ప్రపంచం స్వాగతిస్తోంది. ఈ సమావేశం కూడా సమాజ సేవలకు అంకితం కావాలి. వివిధ వైద్య విధానాల మధ్య ఉన్న అంతరాన్ని ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ కలిసి తొలగించాలి. భారతీయ వైద్య విధానాలను యోగాతో అనుసంధానం చేస్తారని ఆశిస్తున్నా. ఈదిశగా మీరు చేసే కృషి మానవాళికి సంతోషాన్నిస్తుంది. శాంతియుత ప్రపంచానికి మేలు చేకూర్చినట్లవుతుంది.. ధన్యవాదాలు.