Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బెంగళూరులో జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మార్కెల్‌తో ప్రధాని మోదీ సమావేశం

బెంగళూరులోని బోష్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ కేంద్రంలో జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మార్కెల్‌ను ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానించారు. కంటి జబ్బులను గుర్తించడం, ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించడం వంటి సామాన్యులకు ఉపయుక్తమయ్యే అనేక అంశాలపై అక్కడ జరుగుతున్న పరిశోధనలను, సమస్యలకు పరిష్కారా మార్గాలపై జరుగుతున్న కృషిని ఇరువురు నేతలు పరిశీలించారు. మధ్యలో బడి మానేసిన వారికోసం బోష్‌ వొకేషనల్‌ సెంటర్‌లో జరుగుతున్న నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల గురించి అక్కడి సిబ్బంది ఇరువురు నేతలకు వివరించారు.

ఫ్రాంకోవర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నాస్‌కామ్‌ నిర్వహించిన బిజినెస్‌ ఫోరం సమావేశానికి ప్రధాని మోదీ, జర్మన్‌ చాన్సలర్‌ మార్కెల్‌ హాజరయ్యారు. ప్రపంచమంతా మాంధ్యంలో ఉన్న ఈ పరిస్థితులో… భారత్‌ మాత్రం పెట్టుబడులకు చుక్కానిలా మారిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

పెట్టుబడిదారులకు సంబంధించి ఎన్నో రోజులుగా అపరిష్కృతంగా ఉన్న అంశాలను పరిష్కరించేందుకు తాము తీసుకుంటున్న చర్యలగురించి ప్రధాని స్థూలంగా వివరించారు. భారత్‌లో పెట్టుబడులకు ఉన్న వివిధ అవకాశాల గురించి ఆయన ప్రసంగించారు.

‘‘మా స్వప్నాలు వాస్తవాలుగా సాక్షాత్కరించేందుకు మీ అందరి క్రియాశీలమైన భాగస్వామ్యాన్ని ఆకాంక్షిస్తున్నాను. మా లక్ష్యాలను వేగంగా, సమర్థంగా అందుకునేందుకు మేం చూపిస్తున్న నిబద్ధత, వేస్తున్న బలమైన అడుగులతో జర్మనీ కంపెనీలకు విస్తారమైన అవకాశాలు కల్పిస్తాయని చెప్పగలను. 5 కోట్ల గృహాల నిర్మాణం నుంచి వంద స్మార్ట్‌ సిటీల ఆవిష్కారం దాకా; మా రైల్వే నెట్‌వర్క్‌, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ నుంచి కొత్త రైల్వే కారిడార్ల ఏర్పాటు దాకా; 175 జీడబ్ల్యూ పునరుత్పాదక విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ నెట్‌వర్క్‌లు, జాతీయ రహదారులు, వంతెనలు, మెట్రో రైళ్లు… ఇలా అనేక రూపాల్లో అవకాశాలు ఎదురు చూస్తున్నాయి.

ప్రపంచంలో ఏ దేశంలో ఇంత పెద్ద స్థాయిలో నిర్మాణ, ఉత్పత్తి అవకాశాలు అందుబాటులో ఉండవని చెప్పగలను. అన్నిటికంటే ముఖ్యంగా, ఇంత భారీ స్థాయిలో ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరూ ఇలాంటి అవకాశం కల్పించరు. డిజిటల్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా వంటి మా ప్రతిష్ఠాత్మక కార్యాచరణ ద్వారా మా లక్ష్యాలను శక్తిమంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మా శక్తిని పూర్తిగా వినియోగించుకునేందుకు, ‘స్టార్టప్‌ ఇండియా’ క్యాంపెయిన్‌ కూడా ప్రారంభించాం. అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా హార్డ్‌వేర్‌ను కదిలించేది భారతీయ సాఫ్ట్‌వేరే. టెక్నాలజీపై పట్టు సాధించేది భారతీయ నైఫుణ్యమే. ఉత్పత్తి రంగానికి ఊపు తెచ్చేది భారతీయ మార్కెట్లే.

అందువల్ల, భారత్‌లో ఉండటమనేది బలమైన వ్యాపార అవకాశాలకు నిదర్శనంగా ఉంటుంది’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

‘‘జర్మన్‌ ఇంజనీరింగ్‌, భారత ఐటీ మిళితమై అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులకు అవకాశమున్న సందర్భంలో జర్మన్‌ చాన్స్‌లర్‌ మార్కెల్‌ దృక్పథం బహుదా ప్రశంసనీయం. ఆమెకు మా హృదయపూర్వక ధన్యవాదాలతో, సాదర వీడ్కోలు పలుకుతున్నాం. ఇది భారత్‌, జర్మనీల బంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు దోహదపడిన, ఎంతో ఫలవంతమైన పర్యటన’’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.