Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బొగ్గు గనుల చట్టం (స్పెషల్ ప్రొవిజన్స్ ) – 2015 ప్రకారం బొగ్గు మంత్రిత్వ శాఖలో జాతీయ అథారిటీ (సంయుక్త కార్యదర్శి స్థాయి ) పోస్టు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం


బొగ్గు గనుల చట్టం (స్పెషల్ ప్రొవిజన్స్ ) – 2015 ప్రకారం బొగ్గు మంత్రిత్వ శాఖ లో నామినేటెడ్ అథారిటీ ( సంయుక్త కార్యదర్శి స్థాయి ) పోస్టు ను ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నూతనంగా ఏర్పాటు చేయనున్న ఈ పోస్టు చేపట్టే వారికి పే బ్యాండ్ 4, రూ.37,400-రూ.67,000 , గ్రేడ్ పే రూ.10,000 లుగా నిర్ధరించారు. ఈ అథారిటీకి సహకరించేందుకు కింది స్థాయి అధికారులను కూడా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ సమ్మతి తెలిపింది. బొగ్గు గనుల చట్టం ( స్పెషల్ ప్రొవిజన్స్ ) లో పేర్కొన్న నామినేటెడ్ అథారిటీ కార్యకలాపాలను సులభతరం చేసేందుకు ఈ నూతన పోస్టును ఏర్పాటు చేయనున్నారు. అలాగే బొగ్గు గనుల చట్టంలో పేర్కొన్న లక్ష్యాలను సాధించడమే ముఖ్య ఉద్దేశం.

బొగ్గు రంగాన్ని ప్రభావితం చేస్తున్న అనిశ్చితులను తొలగించేలా నామినేటెడ్ అథారిటీ సమర్థవంతంగా పనిచేసేందుకు నూతన పోస్టు దోహదపడనుంది. అలాగే కీలక రంగాలకు బొగ్గు లభ్యతను మెరుగు పరచడం ద్వారా దేశ ఆర్థిక ప్రగతి వేగవంతం అవుతుంది.