Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ‌హ్రెయిన్ లో భార‌తీయ స‌ముదాయాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన‌ మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బ‌హ్రెయిన్ లో భార‌తీయ స‌ముదాయాన్ని ఉద్దేశించి ఈ రోజు న ప్ర‌సంగించారు.

‘‘నా బ‌హ్రెయిన్ ప‌ర్య‌ట‌న ప్ర‌ధాన మంత్రి గా, ప్రభుత్వ అధినేత గా చోటు చేసుకొని ఉండి వుంటే ఉండ‌వ‌చ్చును గాని నా ధ్యేయమల్లా ఇక్క‌డ స్థిర‌ప‌డిన భార‌తీయుల ను క‌లుసుకోవ‌డమూ మ‌రియు బ‌హ్రెయిన్ లోని ల‌క్ష‌లాది స్నేహితుల తో సంభాషించ‌డ‌మూను. నేడు ప‌విత్ర‌మైన‌టువంటి జ‌న్మాష్ట‌మి పండుగ రోజు. జ‌న్మాష్ట‌మి సంద‌ర్భం లో కృష్ణుడి క‌థ ను చెప్పే సంప్ర‌దాయం ఈ నాటి కి గ‌ల్ఫ్ ప్రాంతం లో ఉన్నట్లు నా దృష్టి కి వ‌చ్చింది. రేప‌టి రోజు న శ్రీ‌నాథ్ జీ యొక్క దేవాల‌యాన్ని నేను సంద‌ర్శించి, మ‌రి మీ అంద‌రి యొక్క శాంతి, సమృద్ధి ల కోసం ఇంకా మీ యొక్క దేశం లో శాంతి, స‌మృద్ధి ల‌ కోసం ప్రార్థించనున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

‘‘ఈ సంద‌ర్భాన్ని భార‌త‌దేశం నుండి వ‌చ్చిన భ‌క్తుల తో పాటు మీరు కూడా ఏ విధం గా అయితే ఉల్లాసం తో, పూజ‌నీయ భావ‌న తో జ‌రుపుకొంటారో నాకు ఎరుకే. మ‌రి ఈ ఆలయం యొక్క పున‌రుద్ధ‌ర‌ణ ప‌ని కూడా రేప‌టి రోజు న లాంఛ‌నప్రాయం గా ఆరంభం కానుండ‌టం కూడా సంతోషాన్ని ఇచ్చే అంశం’’ అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

భార‌తీయులు బ‌హ్రెయిన్ యొక్క సామాజిక‌ జీవనానికి, ఆర్థిక జీవ‌నాని కి అందిస్తున్న‌టువంటి తోడ్పాటు, వారి నిజాయితీ, విధేయ‌త‌, ఇంకా ద‌క్ష‌త బ‌హ్రెయిన్ లో వారి కి ఎక్క‌డ లేని మంచి పేరు ను తెచ్చిపెట్టాయి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ‘‘మీరు మీ యొక్క క‌ఠోర శ్ర‌మ కార‌ణం గా ఇక్క‌డ మీకంటూ ఒక స్థానాన్ని ద‌క్కించుకొన్నారు. ఇక్క‌డి ప్ర‌భుత్వం లో భార‌తీయ సిబ్బంది తాలూకు ప్ర‌శంస ను, ఇక్కడి వ్యాపార వర్గం తాలూకు ప్ర‌శంస ను, ఇక్కడ స్థిరపడినటువంటి వారి యొక్క ప్రశంసను నేను విన్న‌ప్పుడ‌ల్లా, నా యొక్క హృద‌యం సంతోషం తో నిండిపోతుంది’’ అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

ప్ర‌స్తుతం భార‌త‌దేశం లో దాదాపు గా ప్ర‌తి ఒక్క కుటుంబమూ బ్యాంకింగ్ సేవ‌ల తో ముడిప‌డింద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. మొబైల్ ఫోన్ లు, ఇంట‌ర్ నెట్ భార‌త‌దేశం లో సాధార‌ణ ప‌రివారం అందుబాటు లోకి వ‌చ్చాయి. భార‌త‌దేశం లో ప్ర‌పంచం లో కెల్లా అతి త‌క్కువ ధ‌ర లో ఇంట‌ర్ నెట్ డాటా దొరుకుతోంది. భార‌త‌దేశం లో అనేక సేవ‌ల ను డిజిట‌ల్ మాధ్య‌మం ద్వారా స‌ర‌ఫ‌రా చేసేందుకు అన్ని ర‌కాల ప్రయత్నాలు జ‌రుగుతున్నాయి అని ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశం యొక్క క‌ల‌ల ను పండించ‌వ‌చ్చ‌ని, భార‌త‌దేశం యొక్క ఆశ‌ల ను, మ‌రియు ఆకాంక్ష‌ల ను నెర‌వేర్చ‌వ‌చ్చ‌ని ప్ర‌తి ఒక్క భార‌తీయుడు న‌మ్ముతున్నాడ‌ని ప్ర‌ధాన మంత్రి విరించారు. ‘‘మా యొక్క ల‌క్ష్యాలు ఉన్న‌త‌మైన‌వి. అయితే, మీకు 130 కోట్ల మంది ప్ర‌జ‌ల బాహువులు ఉన్న‌ప్పుడు మీరు ప్రోత్సాహాన్ని అందుకొంటారు. భార‌త‌దేశం ప్ర‌స్తుతం ముందుకు క‌దులుతున్న‌ది. ఒక్క ప్ర‌భుత్వ య‌త్నాల తో మాత్రమే కాకుండా కోట్లాది భార‌తీయుల ప్రాతినిధ్యం వ‌ల్ల ఇది జ‌రుగుతున్న‌ది. ప్ర‌భుత్వం బస్సు చ‌క్రం వ‌ద్ద కూర్చొనివుంది. అయితే, యాక్సిల‌రేట‌ర్ ను నొక్కుతున్న‌ది మాత్ర‌ం భార‌త‌దేశ ప్ర‌జ‌లే’’ అని ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్యానించారు.

భీమ్ యాప్‌, యుపిఐ, ఇంకా జ‌న్ ధ‌న్ ఖాతా వంటి సదుపాయాలు భార‌త‌దేశం లో బ్యాంకింగ్ ను సామాన్య పౌరుల కు అందుబాటు లోకి తీసుకు వ‌చ్చాయి అని ఆయ‌న చెప్పారు. మా యొక్క రూపే కార్డు ప్ర‌స్తుతం ప్ర‌పంచం అంత‌టా లావాదేవీల కు ఒక అభిమాన పాత్ర‌మైన‌ మాధ్య‌మం గా రూపొందుతోంది. ఇప్పుడు మా రూపే కార్డుల ను ప్ర‌పంచ‌వ్యాప్తం గా విక్రేత‌లు అంద‌రితో పాటు బ్యాంకులు సైతం ఆమోదిస్తున్నాయి అని ఆయ‌న చెప్పారు.

‘‘మీరు త్వ‌ర‌లోనే బ‌హ్రెయిన్ లో రూపే కార్డు తో లావాదేవీలు జ‌రుప‌గ‌లుగుతారు అన్న సంగ‌తి నాకు సంతోషాన్ని ఇస్తోంది. ఈ రోజు న రూపే కార్డు వినియోగం కోసం ఒక ఎంఒయు పై సంత‌కాల‌య్యాయి. మా అభిమ‌త‌ం ఏమిటంటే రూపే కార్డు ద్వారా డ‌బ్బు ను భార‌త‌దేశాని కి పంపించాల‌నే స‌దుపాయాన్ని మీకు క‌ల్పించాల‌న్న‌దే. ప్ర‌స్తుతం మీరు బ‌హ్రెయిన్ – రూపే తో చెల్లించు అని ప‌లుక‌ గ‌లుగుతారు’’ అని ఆయ‌న అన్నారు.

గ‌డ‌చిన అయిదు సంవ‌త్స‌రాల కాలం లో భార‌త‌దేశం లోని 130 కోట్ల మంది భార‌తీయుల తో పాటు విదేశాల లో నివ‌సిస్తున్న కోట్లాది భార‌తీయులు వారి యొక్క శిర‌స్సు ను ఎల్ల‌ప్పుడూ ఉన్న‌తం గా నిల‌పాల‌న్న‌దే మా యొక్క ప్ర‌యాస గా ఉండింది అని ఆయ‌న చెప్పారు. ఇవాళ భార‌త‌దేశం ప్ర‌పంచాన్ని గౌర‌వం గా చూస్తోంది అంటే, దాని వెనుక ఉన్న‌టువంటి ప్ర‌ధాన‌మైన కార‌ణం మీ వంటి ల‌క్ష‌లాది స‌హ‌చ‌రుల వ‌ల్ల‌నే అని ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశం లోని ప‌రిణామాల‌ ను గురించి ఆయ‌న వివ‌రిస్తూ, భార‌త‌దేశం నిరంత‌రాయ ప‌య‌న గ‌తి కోసం ‘ఒక దేశం, ఒక కార్డు’ దిశ గా సాగుతోంద‌న్నారు. యావ‌త్తు భార‌త‌దేశం ‘ఒక దేశం, ఒక గ్రిడ్’ తో పాటు జిఎస్‌టి రూపం లో ‘ఒక దేశం, ఒక పన్ను’తో కూడా జోడించబ‌డింది. భార‌త‌దేశం ‘జీవించ‌డం లో సౌల‌భ్యం’ కోసం, ఇంకా ‘వ్యాపారం చేయ‌డం లో సౌల‌భ్యం’ కోసం ప‌లు చ‌ర్య‌ల ను చేప‌ట్టింది. భార‌త‌దేశపు యువ‌తీయువ‌కులు అన్ని ప‌రిష్కార మార్గాల ను భార‌త‌దేశం లో రూపొందిస్తున్నారు. వారు ప్ర‌పంచం అంత‌టా అమ‌లు చేయ‌గలిగిన‌టువంటి స్థానిక ప‌రిష్కార మార్గాల ను అన్వేషించ‌డం కోసం అత్యంత చిత్త‌శుద్ధి తో శ్ర‌మిస్తున్నారు. భార‌త‌దేశం ప్ర‌తిభ కు ప్ర‌పంచం అంత‌టా గుర్తింపు ల‌భిస్తున్న‌ది. ప్ర‌పంచ శ్రేణి ప‌థ‌కాల లో, ఇంకా ప్ర‌పంచ శ్రేణి సంస్థ‌ల లో భార‌త‌దేశం యొక్క యువ‌త అద్భుతాల ను ఆవిష్క‌రిస్తున్న‌ది. భార‌త‌దేశాని కి చెందిన శాస్త్రవేత్త‌లు అంత త‌క్కువ బ‌డ్జెటు లో చంద్ర‌యాన్ వంటి కార్యాన్ని సాధించినందుకు ప్ర‌పంచ వ్యాప్తం గా అభినంద‌న‌ల కు పాత్ర‌మ‌వుతున్నారు. అటువంటి నాణ్య‌త కేవ‌లం మా యొక్క ప్ర‌యోజ‌న‌మే కాదు కానీ అది మాకు ఒక గుర్తింపు ను కూడా తీసుకు వ‌చ్చింది. ఆ గుర్తింపు ఏమిటి అంటే, మేము బ‌డ్జెటు ల మీద గాక‌ మా యొక్క ల‌క్ష్యాల ను సాధించుకోవ‌డం కోసం ఇచ్ఛాశ‌క్తి పైన శ్ర‌ద్ధ‌ ను తీసుకొంటాము అనేదే.

2022వ సంవ‌త్స‌రం లో భార‌త‌దేశం స్వాతంత్య్రం సిద్ధించిన అనంత‌రం 75 సంవ‌త్సరాల‌ ను పూర్తి చేసుకోబోతోంది అని ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డించారు. మిమ్ముల‌ను మీ స్థాయి లో కొన్ని నూత‌న సంక‌ల్పాల‌ ను తీసుకోవ‌ల‌సింది గా మీకు నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. మీరు నిర్ణ‌యించండి ఏమని అంటే ప్ర‌తి ఒక్క వ్య‌క్తి, ప్ర‌తి ఒక్క సంవ‌త్స‌రం లో భార‌త‌దేశం లోని పర్వత ప్రాంత పట్టణాల ను, సుసంప‌న్న‌మైనటువంటి సాంస్కృతిక వార‌స‌త్వ ప్ర‌దేశాల‌ ను, ఆధ్యాత్మిక క్షేత్రాల‌ ను వారు సంద‌ర్శించ‌డం కోసం భార‌త‌దేశం లో పర్యటించేట‌ట్టు బహ్రెయిన్ లోని తన మిత్రుల లో ప్రేర‌ణ ను క‌లుగజేస్తాను అని. ఒక‌సారి వినియోగించిన ప్లాస్టిక్ బారి నుండి 2022వ సంవ‌త్స‌రం క‌ల్లా భార‌త‌దేశాన్ని విముక్తం చేయాల‌నే ఒక ప్ర‌తిజ్ఞ ను కూడా మేము స్వీక‌రించాము.

‘‘మ‌న ఉమ్మ‌డి విలువ‌ లు మ‌రియు మన ఉమ్మ‌డి ప్ర‌యోజ‌నాల దిశ గా కృషి చేయాల‌ని భార‌త‌దేశం, బ‌హ్రెయిన్ లు సంయుక్తం గా క‌ట్టుబ‌డాలి. భార‌త‌దేశ‌ం, బహ్రెయిన్ ప్రాచీనమైన నాగ‌ర‌క‌త క‌లిగిన ఆధునిక‌ దేశాలు గా ఉన్నాయి. రెంటి కి అపార‌మైన‌టువంటి సంభ‌వ‌నీయ‌తలు ఉన్నాయి. నాకు పూర్తి న‌మ్మ‌కం ఉంది.. అది ఏమిటి అంటే బ‌హ్రెయిన్ లోని నా తోటి భార‌తీయులు ఈ సంబంధం యొక్క బంధాన్ని మ‌రింత బ‌ల‌వ‌త్త‌రం గా మార్చగలరని, అలాగే భార‌త‌దేశం- బ‌హ్రెయిన్ సంబంధాల ను స‌రిక్రొత్త శిఖ‌రాల కు చేర్చుతార‌నీనూ’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

**