Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం- బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గాఢతరం చేసుకొనేందుకు బ్రెజిల్ సందర్శన నాకొక అవకాశాన్ని ప్రసాదిస్తుంది: ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 13వ మరియు 14వ తేదీ లలో ఈ సంవత్సరపు బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) శిఖర సమ్మేళనం లో పాలు పంచుకోనున్నారు. ‘‘అన్ని వర్గాల ను కలుపుకుపోయే భ‌విష్య‌త్తు కోసం ఆర్థిక వృద్ధి సాధన’’ అనేది స‌మిట్ ప్ర‌ధాన ఇతివృత్తం గా ఉంది.

“పలు రంగాల లో ఇతోధికం గా స‌హ‌కరించుకొనే అంశం పై బ్రిక్స్ నేత‌ల తో చ‌ర్చ‌ల లో పాలు పంచుకోవడం కోసం నేను నిరీక్షిస్తున్నాను. ఈ శిఖ‌ర స‌మ్మేళ‌నం సాగే క్ర‌మం లో బ్రిక్స్ బిజినెస్ ఫోర‌మ్‌, బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ ల‌తో పాటు న్యూ డెవెల‌ప్‌మెంట్ బ్యాంక్ స‌మావేశాల లో నేను ప్ర‌సంగిస్తాను. ఆర్థిక సంబంధాల ను మెరుగు ప‌ర‌చుకోవ‌డం అనేది బ్రిక్స్ స‌భ్య‌త్వ దేశాల కు మేలు ను చేకూర్చుతుంది. బ్రెజిల్ ను సంద‌ర్శించడం వ‌ల్ల భార‌త‌దేశం- బ్రెజిల్ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని గాఢ‌త‌రం చేసుకొనేందుకు ఉన్న అవకాశాల పై బ్రెజిల్ అధ్య‌క్షుని తో చ‌ర్చించే అవ‌కాశం నాకు లభించగలదు. వ్యాపారం, ర‌క్ష‌ణ‌, వ్య‌వ‌సాయం మ‌రియు శ‌క్తి వంటి రంగాల లో అనేక అవ‌కాశాలు ఉన్నాయి” అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.