Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం మరియు క్రోయేశియా ల మధ్య ఆర్థిక సహకారం ఒప్పందానికి మంత్రిమండలి ఆమోదం


ఆర్థిక సహకారానికి సంబంధించి భారతదేశం మరియు క్రోయేశియా ల మధ్య ఒప్పందంపై జరిగిన సంతకాలకు మరియు ఆ ఒప్పందాన్ని ధ్రువపరచడానికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

భారతదేశం మరియు క్రోయేశియా లు ఇదివరకు 1994 సెప్టెంబరు లో వ్యాపారం మరియు ఆర్థిక సహకారం కోసం ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక వ్యాపారాన్ని, ఆర్థిక సంబంధాలను పెంచి పోషించుకొంటూ ఉండడమే ఈ ఒప్పందం ధ్యేయం. ఈ రెండు దేశాల మధ్య అమలవుతున్న ఒప్పందం కాలపరిమితి 2009 నవంబరు లో ముగియడంతో, ఒక కొత్త ఒప్పంద పత్రంపైన సంతకాలు చేయడం ద్వారా ఇరు దేశాలు తమ మధ్య బంధాన్ని కొనసాగించినట్లవుతోంది.

క్రోయేశియా తో భారతదేశ ద్వైపాక్షిక వ్యాపారం 2012-13లో 152.01 మిలియన్ యు ఎస్ డాలర్లుగాను, 2013-14లో 148.86 మిలియన్ యు ఎస్ డాలర్లుగాను, 2014-15 లో 205.04 మిలియన్ యు ఎస్ డాలర్లుగాను నమోదు అయింది. గత మూడు సంవత్సరాలలోను సరాసరి ద్వైపాక్షిక వ్యాపార వృద్ధి 17.44 శాతం గా ఉంది.

*****