Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశమంతటా వివిధ పండుగ రోజుల సందర్భంగా ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


భారతదేశవ్యాప్తంగా వేరు వేరు పర్వదినాలను జరుపుకొంటున్న దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాభినందనలు తెలియజేశారు.

“భారతదేశవ్యాప్తంగా వివిధ పండుగలను జరుపుకొంటున్న ప్రజలకు ఇవే నా అభినందనలు. ఈ మంచి రోజు ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోషాన్ని, సమృద్ధిని ప్రసాదించుగాక.

আমার বাঙালি বন্ধুদের জানাই শুভ নববর্ষ। আপনাদের সবাইকে ১লা বৈশাখের শুভেচ্ছা এবং এক অসাধারণ আগামী বছরের জন্য প্রার্থনা করি।

నా బెంగాలీ మిత్రులకు శుభొ నబొ బర్షొ. మీకందరికీ ‘పొయిలా బొయిసాఖ్’; నూతన సంవత్సరం మీకు అద్భుతంగా సాగాలని ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను.

ব’হাগ বিহুৰ শুভক্ষণত অসমবাসীলৈ বহুত বহুত শুভেচ্ছা জনালোঁ।

మంగళప్రదమైన ‘బొహాగ్ బిహు’ ను పురస్కరించుకొని అస్సాం ప్రజలకు ఇవే నా శుభాకాంక్షలు.

என் தமிழ் சகோதர சகோதரிகளுக்கு இனிய தமிழ் புத்தாண்டு வாழ்த்துகள். இந்த ஆண்டு முழுவதும் மகிழ்ச்சியும் நல்ல ஆரோக்கியமும் வளமும் கிடைக்கட்டும்

తమిళ సోదర సోదరీమణులకు ఇవే నా ‘పూత్తాండు’ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అంతా కూడా సంతోషాన్ని, మంచి ఆరోగ్యాన్ని మరియు సమృద్ధిని ప్రసాదించుగాక.

കേരളത്തിലെ ജനങ്ങള്‍ക്ക് എന്റെ വിഷു ആശംസകള്‍. വരും വര്‍ഷം സന്തോഷവും നല്ല ആരോഗ്യവും പ്രദാനം ചെയ്യട്ടെയെന്ന് ഞാന്‍ പ്രാര്‍ത്ഥിക്കുന്നു.

ప్రత్యేకమైనటువంటి ‘విశు’ సందర్భంగా, కేరళ ప్రజలకు నేను నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. రానున్న సంవత్సరం సంతోషాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని అందించాలంటూ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను.

ପ୍ରିୟ ଓଡିଶାବାସୀଙ୍କୁ ମହାବିଷୁବ ସଂକ୍ରାନ୍ତିର ଅଭିନନ୍ଦନ । ନବବର୍ଷରେ ଆପଣମାନଙ୍କ ସକଳ ଆଶା ଓ ଅଭିଳାଷ ପୂରଣ ହେଉ ବୋଲି ମୋର ଶୁଭକାମନା ।

‘మహా విశుబ సంక్రాంతి’ దినాన ఒడియా ప్రజలందరికీ శుభాభినందనలు. రానున్న సంవత్సరంలో మీ ఆకాంక్షలు నెరవేరుగాక” అంటూ ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో పేర్కొన్నారు.

***