Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశానికి, జోర్డాన్ కు మధ్య మానవ వనరుల కల్పన రంగంలో సహకారం కోసం ఉద్దేశించిన ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


మానవ వనరుల కల్పన రంగంలో సహకారంపై భారతదేశానికి, జోర్డాన్ కు మధ్య అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

కంట్రాక్చువల్ ఎంప్లాయ్ మెంట్ లో ఉత్తమ పద్ధతులు, నియామక ప్రక్రియలలో అధునాతన సంస్కరణల ప్రభావం, జోర్డాన్ లో భారతీయ కార్మికుల రక్షణ, సంక్షేమం మొదలైన విషయాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించాలన్నది ఈ ఎమ్ఒయు ధ్యేయం. భారతీయుల నియామకానికి ఆన్ లైన్ పోర్టల్ ను ఉపయోగించడంలో ఉభయ పక్షాల మధ్య సహకారం అత్యంత పారదర్శకత్వానికి బాట వేయడమే కాకుండా నియామక ప్రక్రియలో దురభ్యాసాలను నిరోధించగలదని ఆశిస్తున్నారు.

ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉండే ఈ ఎమ్ఒయు లో ఆటోమేటిక్ రిన్యువల్ నిబంధనతో పాటు ఒక సంయుక్త సాంకేతిక సంఘం ద్వారా పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా పేర్కొన్నారు.