పిఎంఇండియా
భారతదేశానికి, ఫిజీకి మధ్య పునరుత్పాదక శక్తి పై సహకారం కోసం ఉద్దేశించిన అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఎమ్ఒయు పై ఫిజీ లోని సువా లో 2017 మే 24వ తేదీన సంతకాలు అయ్యాయి.
పరస్పరం సమాన ప్రయోజనాలు మరియు ఆదాన ప్రదానం ప్రాతిపదికలపై నూతన, ఇంకా పునరుత్పాదక శక్తి సంబంధ అంశాలలో సాంకేతికత పరంగా ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించుకోవడానికీ, పెంపొందించుకోవడానికీ ఒక సహకారపూర్వకమైనటువంటి సంస్థాగత సంబంధ పునాదిని ఏర్పరచాలన్నది ఇరు పక్షాల ధ్యేయంగా ఉంది.
సహకారానికి సంబంధించిన రంగాల తాలూకు అంశాలను సమీక్షించడం, పర్యవేక్షించడం, చర్చించడం కోసం ఒక సంయుక్త కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఈ ఎమ్ఒయు సంకల్పిస్తోంది. సమాచార నెట్ వర్కింగ్ కు మరియు ప్రావీణ్యం మార్పిడికి కూడా ఇది వీలు కల్పిస్తుంది.
ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంలో ఈ ఎమ్ఒయు తోడ్పాటును అందించనుంది.
****