Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతీయ కాలమిస్ట్, హాస్య రచయిత మరియు సుప్రసిద్ధ నాటక రచయిత శ్రీ‌ తారక్ మెహతా కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


భారతీయ కాలమిస్ట్, హాస్య రచయిత మరియు నాటక రచయిత శ్రీ‌ తారక్ మెహతా కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

“సుప్రసిద్ధ నాటక రచయిత మరియు హాస్య రచయిత శ్రీ తారక్ మెహతా కు ఇదే నా శ్రద్ధాంజలి. ఆయన జీవన పర్యంతం వ్యంగ్యాన్ని, కలాన్ని వీడలేదు. నాకు ఆయనతో భేటీ అయ్యే అదృష్టం పలుమార్లు దక్కింది. ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించినప్పుడు కూడా కలుసుకొనే అవకాశం లభించింది. శ్రీ తారక్ మెహతా రచనలలో భారతీయ వైవిధ్యంలోని ఏకత్వ ఛాయ కనిపిస్తుంది. టప్పూ సహా అనేక పాత్రలు మనసులో ముద్ర వేసుకున్నాయి” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.