పిఎంఇండియా
భారత్.. రామ్సర్ స్థలాల్లో ‘సెంచరీ’ని సాధించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర్ప్రదేశ్.. బలియాలో గల జై ప్రకాశ్ నారాయణ్ పక్షుల అభయారణ్యాన్ని (సురహా తాల్) దేశంలో 100వ రామ్సర్ స్థలంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని స్పందించారు.
ఆ బురద నేల వివిధ రకాలైన పక్షులకు నిలయంగా ఉందనీ, స్థానిక పక్షులతో పాటు అనేక వలస పక్షులను కూడా ఈ ప్రాంతం ఆకర్షిస్తోందనీ ప్రధానమంత్రి అన్నారు.
ఈ ప్రశంసనీయ ప్రగతి ప్రస్థానం.. ప్రాకృతిక పర్యావరణాన్ని, మరీ ముఖ్యంగా కీలక బురద నేలల్ని సంరక్షించుకోవడంలో భారత్ కనబరుస్తున్న తిరుగులేని నిబద్ధతను కళ్లకు కడుతోందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
బురద నేలల సంరక్షణ, పునరుద్ధరణ దిశగా సాగుతున్న ప్రయత్నాలను గత కొన్ని సంవత్సరాల్లో, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు విజ్ఞానశాస్త్రం, నూతన ఆవిష్కరణలు, క్రియాశీల జాగరూకత కార్యక్రమాలను కూడా నిర్వహించి చెప్పుకోదగిన రీతిలో బలోపేతం చేశారని ప్రధానమంత్రి వివరించారు. ఈ ఉమ్మడి కృషితో జీవవైవిధ్యాన్ని సంరక్షించడంలో, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడడంలో, రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని పచ్చదనంతో అలరారే భవిష్యత్తును నిర్మించడంలో ఊతం లభించిందని ఆయన స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘రామ్సర్ స్థలాల పరంగా చూస్తే సెంచరీ నమోదైంది!
ఉత్తర్ప్రదేశ్.. బలియాలో గల జై ప్రకాశ్ నారాయణ్ పక్షుల అభయారణ్యం (సురహా తాల్)ను భారత్లో 100వ రామ్సర్ స్థలంగా ప్రకటించారని తెలిసి సంతోషిస్తున్నాను. ఈ బురద నేల.. పక్షుల వైవిధ్యానికి పెట్టింది పేరు.. ఇది స్థానిక పక్షులతో పాటు అనేక వలస పక్షులను కూడా ఆకర్షిస్తోంది.
ఈ ఘనత.. మన ప్రాకృతిక పరిసరాలనూ, విశేషించి బురద నేలలను సంరక్షించుకోవడంలో భారత్ కనబరుస్తున్న తిరుగులేని నిబద్ధతను చాటిచెబుతోంది.
గత కొన్నేళ్లలో ప్రజల భాగస్వామ్యం, విజ్ఞానశాస్త్రం, నూతన ఆవిష్కరణలతో పాటు చైతన్య కార్యక్రమాల నిర్వహణ ద్వారా కూడా బురద నేలల సంరక్షణను చేపట్టి, వాటి పునరుద్ధరణ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీవవైవిధ్యాన్ని సంరక్షించడం, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడడంతో పాటు రాబోయే తరాల వారి కోసం హరిత ప్రధాన భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ ప్రయత్నాలు తోడ్పడుతున్నాయి’’ అని పేర్కొన్నారు.
***
A century as far as Ramsar sites are concerned!
— Narendra Modi (@narendramodi) June 5, 2026
Glad that the Jai Prakash Narayan Bird Sanctuary (Surha Tal) in Ballia, Uttar Pradesh has been designated as India’s 100th Ramsar site. This wetland is rich in avifaunal biodiversity, attracting several migratory and resident… pic.twitter.com/HENtPJoRnt