పిఎంఇండియా
భారత్-న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై రెండు దేశాల ప్రధానమంత్రులు సంయుక్త ప్రకటన చేశారు. ఈ మేరకు న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్‌లో ఇవాళ సమావేశమైన అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ భాగస్వామ్యాన్ని మరో నాలుగేళ్లలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 2030 దాకా ఒక ఉమ్మడి ప్రణాళిక అమలుకు వారిద్దరూ ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా ఆరు మూలస్తంభాల ప్రాతిపదికన వివిధ రంగాలలో అనేక కార్యక్రమాలను అమలు చేస్తారు.
మూలస్తంభం 1: రాజకీయ.. దౌత్యపరమైన చర్చలు
ప్రాంతీయ, బహుపాక్షిక కార్యక్రమాలలో ఇద్దరు ప్రధానమంత్రులు, మంత్రిమండళ్ల సభ్యుల మధ్య క్రమం తప్పకుండా సమావేశాలు, పరస్పర పర్యటనల నిర్వహణ.
విదేశాంగ మంత్రుల స్థాయిలో క్రమం తప్పకుండా సంభాషణల ద్వారా ఉన్నత స్థాయి సహకారం కొనసాగింపు.
పరస్పర ప్రయోజన రంగాలన్నిటా సహకార విస్తరణకు సంబంధిత మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల మధ్య తరచూ సమావేశాల నిర్వహణ.
భారత్-న్యూజిలాండ్ మధ్య క్రమం తప్పకుండా పార్లమెంటరీ ఆదానప్రదానం, అధికారిక పర్యటనలకు ప్రోత్సాహం.
భారత విదేశాంగ శాఖ కార్యదర్శి, న్యూజిలాండ్ విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ స్థాయిలో ఏటా సమావేశాల నిర్వహణ. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద 2030 దాకా భవిష్యత్ ప్రణాళిక అమలును ఈ యంత్రాంగం పర్యవేక్షిస్తుంది.
మూలస్తంభం 2: రక్షణ-భద్రత రంగాల్లో సహకారం
సైనిక విన్యాసాలు, వివిధ దళాల పర్యటనలు, స్వల్పకాలికంగా సిబ్బంది రాకపోకలు, క్రీడా పర్యటనలు, డిఫెన్స్ స్టాఫ్ కాలేజీల ఆదానప్రదానం, ఉన్నత స్థాయి రక్షణ సంభాషణల ద్వారా సైనిక స్థాయి చర్చల కొనసాగింపు.
మంత్రిత్వ స్థాయి సహా రక్షణ సంబంధిత అంశాలపై చర్చలు ముమ్మరం చేయడం.
భారత్-న్యూజిలాండ్ రక్షణ సహకార ఒప్పందం-2025ను అమలు చేస్తూ, రక్షణ మంత్రిత్వశాఖ, సైనిక దళాల స్థాయిలో క్రమం తప్పకుండా చర్చల కొనసాగింపు.
సముద్ర రంగంపై దృష్టి సారిస్తూ, సముద్ర సహకార యంత్రాంగం ఏర్పాటు సహా జలగర్భ శాస్త్ర, నాటికల్ కార్టోగ్రఫీ సహకార అమలు ఒప్పందం, పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందాల అమలు.
సముద్ర సహకార యంత్రాంగంలో భాగంగా ద్వైపాక్షిక నావికాదళ విన్యాసాల నిర్వహణ.
ఇండో-పసిఫిక్ మహాసముద్ర ప్రాంత కార్యక్రమంలో భాగమైన సముద్ర భద్రత మూలస్తంభం కింద సముద్ర అంశాలపై సహకారం కొనసాగింపు.
సముద్ర భద్రతపై భారత-న్యూజిలాండ్ విదేశాంగ మంత్రిత్వశాఖల నేతృత్వాన ఏటా చర్చల నిర్వహణ.
ఉగ్రవాద నిరోధంపై సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటు, సంబంధిత అవగాహన ఒప్పందం అమలు సహా పరస్పర అంగీకారంతో తొలి సమావేశం నిర్వహణ.
భారత్-న్యూజిలాండ్ సైబర్ సంబంధాల ద్వారా సంయుక్త సైబర్ భద్రత ప్రాధాన్యాలపై చర్చ.
మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలు, వాటి ముడి పదార్థ రసాయనాల అక్రమ రవాణా నిరోధంపై సహకార అవగాహన ఒప్పందం ఖరారు.
భారత దర్యాప్తు సంస్థ, న్యూజిలాండ్ పోలీసుల మధ్య న్యాయపరమైన సహకారంపై అవగాహన ఒప్పందం ఖరారు.
విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల సంకీర్ణం ద్వారా మౌలిక సదుపాయాల పునరుత్థాన సామర్థ్యం మెరుగు దిశగా సహకార విస్తరణ.
మూలస్తంభం 3: వాణిజ్య – ఆర్థిక సహకారం.. ద్వైపాక్షిక వాణిజ్యం
వస్తుసేవల్లో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి $7 బిలియన్ డాలర్ల (₹35,000 కోట్లు) స్థాయికి పెంచే లక్ష్యంతో కృషి.
భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా అమల్లోకి తెచ్చే తదుపరి చర్యలపై సంయుక్త కృషి.
కస్టమ్స్ సహకార ఒప్పందం-2024 కింద అధీకృత ఆర్థిక ఆపరేటర్ల పరస్పర గుర్తింపు యంత్రాంగం-2025 అమలు దిశగా కస్టమ్స్ ప్రక్రియల సరళీకరణ.
ప్రధాన పరిశ్రమలు
ఉద్యాన రంగంపై 2025 నాటి సహకార ఒప్పందం అమలు ద్వారా ఉమ్మడి పరిశోధన, విజ్ఞాన ఆదానప్రదానం, పంట కోత అనంతర ఆవిష్కరణలు, మార్కెట్ అభివృద్ధికి వేగిరపరచడం.
విధానపరమైన చర్చలు, సాంకేతిక ఆదానప్రదానం, ఉత్తమ పద్ధతుల మార్పిడి, ద్వారా అటవీ సహకారంపై 2025 నాటి ఒడంబడిక అమలు.
సాంకేతిక, విధానపరమైన సహకారంతో పశుసంవర్ధక, పాడి రంగాలపై సహకార ఒప్పందం అమలు.
పర్యాటకం
ద్వైపాక్షికంగా పర్యాటకుల రాకపోకలు సహా పరిశ్రమ పరంగా సహకారాన్ని ప్రోత్సహించేలా పర్యాటక అవగాహన ఒప్పందం అమలు.
నవీకృత వైమానిక సేవల ఒప్పందం కింద విమానయాన సంస్థలు నేరుగా విమానాలు నడిపేందుకు ప్రోత్సహిస్తూ పర్యాటక రంగం వృద్ధికి కృషి.
మూలస్తంభం 4: రక్షణ – భద్రత రంగాల్లో సహకారం
ద్వైపాక్షిక ప్రజా సంబంధాల బలోపేతం దిశగా ప్రవాస భారతీయ సంఘాల భాగస్వామ్యం.
క్రీడల సహకార ఒప్పందం-2025 కొనసాగింపు.
భారత యువజన వ్యవహారాలు-క్రీడల మంత్రిత్వ శాఖ, స్పోర్ట్-న్యూజిలాండ్ మధ్య సంయుక్త క్రీడారంగ కార్యాచరణ ప్రణాళిక అమలు.
సంప్రదాయ వైద్యంపై నిపుణుల స్థాయిలో ఆదానప్రదానాలకు మద్దతు.
భారత నౌకాయాన డైరెక్టరేట్ జనరల్, న్యూజిలాండ్ సముద్ర సంస్థ మధ్య నావికుల ధ్రువీకరణకు గుర్తింపు చర్చల కొనసాగింపు.
లోథాల్ జాతీయ సముద్ర వారసత్వ సముదాయం, న్యూజిలాండ్ సముద్ర మ్యూజియం మధ్య సహకారానికి ప్రోత్సాహం.
రెండు దేశాల సంస్కృతులపై పరస్పర అవగాహన దిశగా సాంస్కృతిక సహకార యంత్రాంగం ఏర్పాటు
స్థానిక ప్రభుత్వాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం.
మూలస్తంభం 5: విద్య, పరిశోధన, సైన్స్-టెక్నాలజీ, విపత్తు నిర్వహణ
రెండు దేశాల విద్యా వ్యవస్థలపై సమాచార ఆదానప్రదానం దిశగా విద్యా సహకార యంత్రాంగం-2025 ఏర్పాటు.
ఈ లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ, సంస్థాగత భాగస్వామ్యాల సంఖ్యను పెంచేందుకు కృషి.
సౌరశక్తి విస్తరణ, నిధుల సమీకరణ, సామర్థ్య వికాసంపై దృష్టితో అంతర్జాతీయ సౌర కూటమితో కలిసి వాతావరణ మార్పుపై చర్యలు, స్వల్ప ఉద్గారాల దిశగా సహకారం విస్తృతి.
సుస్థిర ఇంధన మార్పిడి దిశగా ‘గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమి’తో కలిసి కృషి.
వ్యవసాయం, వాతావరణం, డిజిటల్ రూపాంతరీకరణ, కొత్త సాంకేతికతలపై దృష్టి సారిస్తూ పరిశోధనలు, శాస్త్ర-సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాలకు ప్రోత్సాహం.
సంసిద్ధత, అత్యవసర స్పందన, సామర్థ్య వికాసంపై భారత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, న్యూజిలాండ్ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థల మధ్య సహకార ఒప్పందం అమలు.
మూలస్తంభం 6: ప్రాంతీయ, బహుపాక్షిక సహకారం
నిబంధనాధారిత ఇండో-పసిఫిక్ పరిరక్షణ లక్ష్యంగా ఆసియాన్ నేతృత్వ వేదికలపై అభిప్రాయాల ఆదానప్రదానం.
ఇండో-పసిఫిక్ మహాసముద్ర కార్యక్రమంలోని సముద్ర భద్రత అంశం కింద సహకారాన్వేషణ సహా అంతర్జాతీయ చట్టం… ముఖ్యంగా వివాదాలపై ‘అంక్లాస్’ అనుగుణ శాంతియుత పరిష్కారాలకు మద్దతు.
ఐక్యరాజ్యసమితిలో సహకారం బలోపేతంతోపాటు సంస్కరించిన భద్రత మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతివ్వడం.
బహుపాక్షిక, అంతర్జాతీయ సంస్థల్లో అవకాశం ఉన్నచోటల్లా పరస్పర మద్దతు ప్రకటన.
గమనిక: “భారత్-న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం: భవిష్యత్ ప్రణాళిక-2030”లో ఆర్థిక నిబద్ధత పరంగా ఎలాంటి కట్టుబాట్లు లేవు. జాతీయ లేదా అంతర్జాతీయ చట్టం కింద ఎలాంటి చట్టపరమైన హక్కులు లేదా బాధ్యతలు వంటివి ఏ దేశానికీ సంక్రమించవు.
***
Held extensive and fruitful talks with PM Luxon in Auckland this morning. His own visit to India last year energised our bilateral partnership and my visit today, the first by an Indian Prime Minister in 4 decades, has added further momentum to the India-New Zealand friendship.… pic.twitter.com/W8bpOfAeeE
— Narendra Modi (@narendramodi) July 11, 2026
The areas which were prominently covered in the talks with PM Luxon include trade, technology and investment linkages. We have also developed a strong framework for cooperation in agriculture, dairy and food processing. Equally important is the emphasis on healthcare and… pic.twitter.com/4iHqYUyR8R
— Narendra Modi (@narendramodi) July 11, 2026
PM Luxon and I firmly believe that the greatest strength of our relationship lies in our people-to-people ties. In that spirit, we will enhance cooperation in education, sports, culture, heritage and creative industries.
— Narendra Modi (@narendramodi) July 11, 2026
At the India-New Zealand business event in Auckland, which I attended with PM Luxon, I told business leaders:
— Narendra Modi (@narendramodi) July 11, 2026
India is not only a market.
India is a launchpad for global growth.
Together, let us take this economic partnership to new heights!@chrisluxonmp pic.twitter.com/8M53Lx47zh
This has been a great year for the India-New Zealand partnership. Earlier this year, our nations concluded a Free Trade Agreement in record time and now, we have elevated our ties to a Strategic Partnership. Next up, we wish to double bilateral trade by 2030! https://t.co/IyR5qpUt2X
— Narendra Modi (@narendramodi) July 11, 2026