Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్ లిఫ్టర్ రుషికాంతా సింగ్ చానంబమ్ రజత పతకం సాధించడంపై ప్రధానమంత్రి హర్షం


భారత్ లిఫ్టర్ రుషికాంతా సింగ్ చానంబమ్ రజత పతకాన్ని గెలవడంతో పాటు తన అత్యుత్తమ వ్యక్తిగత ఆటతీరును కనబరిచినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హర్షం వ్యక్తం చేశారు. రుషికాంతా సింగ్ దృఢసంకల్పం, అద్భుత ప్రదర్శన దేశ ప్రజలందరికీ గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని ప్రధానమంత్రి శ్రీ మోదీ అన్నారు.
రాబోయే కాలంలో కూడా రుషికాంతా సింగ్ చానంబమ్ రాణించాలని శ్రీ  మోదీ ఆకాంక్షించారు. రుషికాంతా సింగ్ నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తూ, అనేక మంది యువ క్రీడాకారులకూ, క్రీడాకారిణులకూ స్ఫూర్తిని అందించాలని శ్రీ మోదీ అభిలషించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘భారత లిఫ్టర్ రుషికాంతా సింగ్ చానంబమ్ రజత పతకాన్ని గెలవడంతో పాటు తన అత్యుత్తమ వ్యక్తిగత ఆటతీరును కనబరచడం చూసి నేను ఆనందిస్తున్నాను. ఆయన దృఢసంకల్పం, అద్భుత ప్రదర్శన దేశ ప్రజలకు గొప్ప సంతోషం కలిగించింది. రుషికాంతా సింగ్ నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తూ, అనేక మంది యువ క్రీడాకారులకూ, క్రీడాకారిణులకూ స్ఫూర్తిని అందించాలని నేను కోరుకుంటున్నాను. రాబోయే కాలంలో ఆయన రాణించాలని నేను అభిలషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

***