పిఎంఇండియా
భారత జౌళి రంగంలోని అన్ని దశలనూ భారత్ టెక్స్– 2026 ఒకే ఛత్రం కిందకు తెచ్చిన తీరును వివరిస్తూ కేంద్ర సహాయ మంత్రి శ్రీ పబిత్రా మార్గరీటా రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. దేశ తయారీ సామర్థ్యమూ, సుసంపన్నమైన వస్త్ర పరిశ్రమ వారసత్వమూ, అంతర్జాతీయ విస్తృతినీ వివరిస్తూ ఈ వ్యాసం సాగింది. జౌళి రంగానికి సంబంధించి భారత ‘విజన్ – 2030’ ప్రణాళికను కూడా ఈ వ్యాసం వివరిస్తోందని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
భారత్_టెక్స్ 2026 కార్యక్రమం దేశ జౌళీ రంగంలోని అన్ని దశలనూ ఒకే ఛత్రం కిందకు తెచ్చిందని కేంద్ర సహాయ మంత్రి శ్రీ శ్రీ పబిత్రా మార్గరీటా పేర్కొన్నారు. దేశ తయారీ సామర్థ్యానికీ, సుసంపన్నమైన వస్త్ర పారిశ్రామిక వారసత్వానికీ, పెరుగుతున్న అంతర్జాతీయ విస్తృతికీ ఇది నిదర్శనం. జౌళీ రంగానికి సంబంధించి భారత విజన్– 2030 ప్రణాళికను కూడా ఈ వ్యాసం వివరిస్తోంది.
Union MoS Shri @PmargheritaBJP writes that @Bharat_tex 2026 brings India's complete textile value chain under one roof, showcasing the country's manufacturing strength, rich textile heritage and growing global presence. It also reflects India's Vision 2030 roadmap for the textile… pic.twitter.com/1RlePYAMHm
— PMO India (@PMOIndia) July 15, 2026