Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త్, ఇజ్రాయెల్ దేశాల మ‌ధ్య ద్వంద్వ ప‌న్నుల విధానం లేకుండా చేయుట‌కు, ద్ర‌వ్య క‌ట్ట‌డి విధానంలో ఆదాయ‌,పెట్టుబ‌డుల‌పై ప‌న్నుల వేయ‌టం పై ఒప్పందం


భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కాబినెట్ స‌మావేశంలో భార‌త్,ఇజ్రాయెల్ దేశాల మ‌ధ్య ద్వంద్వ ప‌న్నుల లేకుండా చూచుట‌కు మ‌రియు ముంద‌స్తు స‌మాచారంతో ద్ర‌వ్య క‌ట్ట‌డి విధానంలో ఆదాయ‌, పెట్టుబ‌డుల‌పై ప‌న్నుల వేయ‌టం పై జ‌రిగింది.

స్వ‌దీశీ ప‌న్నుల గురించి కాకుండా బ్యాంకు స‌మాచారంతో ప‌న్ను విష‌యాల స‌మాచారాన్ని స‌మ‌ర్ధవంతంగా అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా మార్పిడి చేసుకోవ‌టానికి ఈ ఓప్ప‌దం అనుమ‌తిస్తుంది. అధేవిధంగా భ‌విష్యత్తులో ఇజ్రాయెల్ దేశం నుంచి ప‌న్నుల‌కు సంబంధించిన స‌మాచారాన్ని బార‌త వ్య‌క్తులు గాని,ఎన్ ఫోర్స్ మెంట్ సంస్థ‌లు గాని సంబందిత సంస్థ‌లు నుంచి స‌మాచారాన్ని పొంద‌వ‌చ్చు,అదేవిధంగా భార‌త‌దేశం నుంచి ఇజ్రాయెల్ పౌరులుగాని, ఎన్ ఫోర్స్ మెంట్ సంస్థ‌లు గాని సంబంధిత సంస్థ‌లు నుంచి త‌గిన అనుమ‌తితో స‌మాచారాన్ని ఉభ‌య దేశాలు కూడా పొంద‌వచ్చు.

ఈ స‌మావేశంలో హ‌ద్దుల‌తో కూడిన లాభాలు పొందే విధంగా నిబంధ‌న‌ను ఈ స‌మావేశంలో తీసుకొచ్చారు. ఈ ఒప్పందాన్నివ్య‌క్తులు గాని సంస్ధ‌లు గాని దుర్వినియోగ ప‌ర్చ‌టానికి వీలు లేకుండా ఉండ‌టానికి ఈ కొత్త నిబంధ‌న‌ని స‌వ‌ర‌ణ ద్వారా చేర్చారు. ఈ నిబంధ‌న చేర్చ‌టంతో స్వ‌దేశీ చ‌ట్టం మ‌రియు ప‌న్నుల ఎగ‌వేత‌ను అరిక‌ట్ట‌డానికి,దుర్వినియోగం చేయ‌టానికి వీలు అవ‌దు.

పూర్వ రంగం:

భార‌త్,ఇజ్రాయెల్ దేశాల మ‌ధ్య ద్వంద్వ ప‌న్నుల ఎగ‌వేత విదానం (డీటీఏసీ) పై 1996 లో ఇరు దేశాల మ‌ధ్య ఒప్పందంపై సంత‌కాలు జ‌రిగాయి. దీంతో భార‌త్,ఇజ్రాయెల్ దేశాలు అంగీక‌రించిన విధంగా స‌మాచార మార్పిడిలో భాగంగా నిబంధ‌న 27 ని అప్డేట్ చేయ‌టంతో అంత‌ర్జాతీయంగా డీటీఏసీ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఆమోదం ల‌భించిన‌ట్లైంది.