Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భూవిజ్ఞాన శాస్త్రం, ఇంకా ఖ‌నిజ వ‌న‌రుల రంగం లో భార‌త‌దేశాని కి మ‌రియు బొలీవియా కు మ‌ధ్య స‌హకారాని కి ఉద్దేశించిన ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


భూవిజ్ఞాన శాస్త్రం మ‌రియు ఖ‌నిజ వ‌న‌రుల రంగం లో స‌హ‌కారం అంశం పై భార‌త‌దేశాని కి మ‌రియు బొలీవియా కు మ‌ధ్య ఒక అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పందం (ఎంఒయు)కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఈ ఎంఒయు పై బొలీవియా లో 2019వ సంవ‌త్స‌రం మార్చి నెల లో సంత‌కాల‌య్యాయి.

ప్ర‌భావం:

ఈ ఎంఒయు ఖ‌నిజ వ‌న‌రుల రంగం లో స‌హ‌కారాని కి గాను భార‌త‌దేశాని కి మ‌రియు బొలీవియా కు మ‌ధ్య ఒక సంస్థాగ‌త యంత్రాంగం స్థాప‌న కు మార్గాన్ని సుగ‌మం చేయ‌నుంది. వ‌న‌రులు, చ‌ట్టాలు, మ‌రియు విధానం తాలూకు స‌మాచారాన్ని ఒక ప‌క్షం మ‌రొక ప‌క్షాని కి వెల్ల‌డి చేసుకోవ‌డం, అభివృద్ధి వ్యూహాల పై త‌మ త‌మ ఆలోచ‌న‌ల‌ ను పంచుకొనేందుకు చ‌ర్చాస‌భ‌ల ను నిర్వ‌హించ‌డం, ఇరు దేశాల మ‌ధ్య సాంకేతిక ప‌రిజ్ఞానం బ‌ద‌లాయింపు ను ప్రోత్స‌హించ‌డం, విలువ జోడింపు ను పెంపొందించ‌డం వంటి వాటి కి ఈ ఎంఒయు బాట‌లు వేయనుంది. త‌ద్వారా అవ‌స‌ర‌మైన ప‌త్రాల రూప‌క‌ల్ప‌న‌ మ‌రియు ఆయా ప‌త్రాల ను ప‌ర‌స్ప‌రం అంద‌జేసుకొనేటటువంటి కార్యక్రమాలకు ఆస్కారం ఏర్పడగలదు.

******