Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భూ కమితాల పరిమాణం తో నిమిత్తం లేకుండా అర్హులైన రైతు కుటుంబాలన్నింటి కి పిఎమ్- కిసాన్ పథకం విస్తరణ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ‘‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’’ (PM-KISAN) పరిధి ని సమగ్రం గా విస్తరించేందుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం తో, అర్హులైన భూమి కమతాలను కలిగివున్నటువంటి రైతులు అందరూ (వ్యవహారం లో ఉన్న మినహాయింపు ప్రమాణాని కి లోబడి) ఈ పథకం తాలూకు లాభాలను పొందగలుగుతారు.

మరింత మంది లబ్ధిదారులు, మరింత ప్రగతి :

సవరించినటువంటి పిఎమ్- కిసాన్ దేశ వ్యాప్తం గా మరింతగా అంటే దాదాపుగా 2 కోట్ల మంది రైతులకు ప్రయోజనాన్ని అందించగలుగుతుంది. ఫలితంగా పిఎమ్- కిసాన్ లబ్ధిదారుల సంఖ్య రమారమి 14.5 కోట్ల కు పెరగనుంది. దీని కి 2019-20 సంవత్సరం లో కేంద్ర ప్రభుత్వ అంచనా వ్యయం 87,217.5 కోట్ల రూపాయల మేరకు చేరే ఆస్కారం ఉంది.

వేగం గా, మరింత మంది కి లబ్ధి.. ఒక ప్రధాన వాగ్దానం ఆచరణ లోకి:

పిఎమ్- కిసాన్ విస్తరణ పై కేంద్ర మంత్రిమండలి నేడు తీసుకొన్న నిర్ణయం ద్వారా 2019 లోక్ సభ ఎన్నికల సందర్భం గా ప్రధాన మంత్రి ఇచ్చిన కీలక వాగ్దానాన్ని నెరవేర్చడం జరిగింది. అలాగే బీజేపీ తన ఎన్నికల ప్రణాళిక లో కూడా ఈ ప్రధానమైన విధాన నిర్ణయంపై ఇచ్చిన హామీ ని ప్రస్తావించింది.

ఈ పథకం సమగ్ర అమలు దిశ గా ఝార్ ఖండ్ లో భూమి రికార్డుల నవీకరణ సంబంధిత సమస్యల తో పాటు అసమ్, మేఘాలయ, ఇంకా జమ్ము & కశ్మీర్ రాష్ట్రాల లో ఆధార్ సంఖ్య జారీ ప్రక్రియ పూర్తి కాకపోవడాన్ని కూడా మంత్రిమండలి సమావేశం పరిగణన లోకి తీసుకుంది.

పీఎం-కిసాన్: రైతులకు ఒక వినూత్నమైనటువంటి ప్రోత్సాహకం యొక్క తోడ్పాటు:

పిఎమ్- కిసాన్ యోజన 2019- 2020 మధ్యంతర బడ్జెటు సమయం లోనే పురుడు పోసుకుంది. దేశం లో 2 హెక్టార్ల దాకా భూ కమతం గల (ఈ పరిమితి ని నేటి మంత్రిమండలి సమావేశం విస్తరించింది) చిన్న, సన్నకారు రైతు కుటుంబాల కు 6,000 రూపాయల మేర ఆదాయ మద్దతు కల్పనే ఈ పథకం లోని కీలకాంశం.

ఈ మొత్తాన్ని నాలుగు నెలల కు ఒక సారి నెల కు 2,000 రూపాయల వంతున మూడు దఫాల్లో విడుదల చేస్తారు. ఈ మొత్తం ప్రత్యక్ష లబ్ధి బదిలీ విధానం కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల లో నేరు గా జమ అవుతుంది. ఈ పథకం పై ప్రకటన వెలువడిన మూడు వారాల లోపల ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహించిన భారీ కార్యక్రమంలో ఇది శ్రీకారం చుట్టుకోవడం ఒక రికార్డు. అటుపైన అనేక మంది రైతులు తొలి వాయిదా మొత్తాల ను కూడా అందుకున్నారు. తదనుగుణం గా ఇప్పటి దాకా తొలి వాయిదా కింద 3.11 కోట్ల మంది, రెండో వాయిదా కింద 2.66 కోట్ల మంది వంతున లబ్ధిదారు రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల కు సొమ్ము జమ చేయబడింది.

ద్విగుణీకృత ఉత్సాహం తో భారత అన్నదాతల కు సేవ:

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటల్లో పలుమార్లు దేశం లోని రైతుల పట్ల ఆయనకు గల గొప్ప మన్నన ప్రస్ఫుటం అవుతూంటుంది. దేశం లోని 130 కోట్ల మంది పౌరుల ను పోషించే బాధ్యత ను తమ భుజస్కంధాలపై మోసే వారు గా రైతుల ను ఆయన కొనియాడుతుంటారు. రైతు సాధికారిత కల్పన దిశ గా 2014-2019 మధ్య తీసుకున్న అనేక చర్యలే కష్టజీవులైన కర్షకులపై ప్రభుత్వానికిగల గౌరవభావానికి నిదర్శనం. దేశం లో పండించే 22 రకాల పంటల కు కనీస మద్దతు ధర పెంపు, భూసార కార్డుల జారీ, ప్రధాన మంత్రి సాగునీటి పథకం, ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన లతో పాటు మెరుగైన వ్యవసాయ మార్కెట్ సదుపాయాల కల్పన కింద ‘ఇ-నామ్’ తదితరాలు ఈ వినూత్న చర్యల లో భాగం గా ఉన్నాయి. ఈ చర్యల ద్వారా వ్యవసాయం మరింత లాభసాటి కావడంతో పాటు ఉత్పాదకత పెంపు దిశ గా రైతుల కు భరోసా లభించింది. భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకోబోయే 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రధాన మంత్రి స్వప్నాన్ని సాకారం చేసేందుకు ఈ చర్యలు ఎంతగానో దోహదం చేయగలవు.