Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘మన్ కీ బాత్’ 134వ ఎపిసోడ్‌లో తన ప్రసంగ ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ 134వ ఎపిసోడ్‌లో భాగంగా తాను చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలను పంచుకున్నారు.

ఎక్స్’ వేదికగా చేసిన వరుస పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

గురిందర్‌వీర్ సింగ్అనిమేష్ కుజుర్‌లతో సంభాషణ చాలా ప్రత్యేకంగా సాగిందిభారత అథ్లెటిక్స్ భవిష్యత్తు ఎందుకు అత్యంత ఉజ్వలంగా ఉందో దీని ద్వారా ఒక అవగాహన కలిగింది!

#MannKiBaat”

భారత మామిడి పండ్లుమామిడి పండ్లలో విభిన్న రకాలను గురించి కచ్చితంగా ప్రస్తావించాల్సిందేవీటిలో మీకు ఇష్టమైనది ఏది?

#MannKiBaat”

వేసవి వేడిని తట్టుకోవడానికి ఈత కొట్టడం ఒక గొప్ప మార్గం#MannKiBaat కార్యక్రమంలోభవిష్యత్ ఈతగాళ్లకు శిక్షణనిస్తున్న కేరళంకు చెందిన సజీ జీ కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించాను!
#MannKiBaat”

దేశవ్యాప్తంగాయువతలో ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువస్తున్న అనేక క్లబ్‌లుసంఘాలు ఉన్నాయిఅటువంటి ప్రతి ప్రయత్నాన్ని చూసి నేను గర్విస్తున్నాను.
#MannKiBaat

ఉత్తరప్రదేశ్‌లోని ఒక డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ప్రశంసనీయమైన పని చేస్తూ… మనతో పాటు ఈ గ్రహంపై జీవిస్తున్న సాటి జీవుల పట్ల శ్రద్ధ వహించాలనే ముఖ్యమైన సందేశాన్నిస్తోంది.

#MannKiBaat”
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆకాష్ గుప్తాగోవాకు చెందిన బాలకృష్ణ అయ్య వంటి వారు జల సంరక్షణకు మార్గదర్శనం చేస్తూ… కీలకమైన సుస్థిరత సందేశాన్ని అందిస్తున్నారు.
#MannKiBaat”

తమిళనాడుకు చెందిన గిరిజా అమ్మతో నా సమావేశాన్ని గుర్తుచేసుకుని… దేశ నిర్మాణం పట్ల ఆమెకున్న అసమాన అభిరుచిని ప్రముఖంగా ప్రస్తావించానువిద్యారంగం కోసం జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ పాఠశాలలు చేస్తున్న కృషినీ అభినందించాను.
#MannKiBaat”

నేను నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి భారత్‌కు తిరిగి తీసుకువచ్చిన చోళుల కాలం నాటి తామ్ర పత్రాల పట్ల దేశంలో గొప్ప ఆసక్తి నెలకొందిఅందుకే, #MannKiBaat కార్యక్రమంలో దాని గురించి మాట్లాడానుఛత్తీస్‌గఢ్‌లో ఇటీవలే కనుగొన్న మూడు అరుదైన తామ్ర పత్రాల విషయాన్నీ ప్రస్తావించాను.

 

****