పిఎంఇండియా
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026 మహిళల 51 కేజీల బాక్సింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న సాక్షికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
సాక్షి అద్భుతమైన ప్రదర్శనను, నిర్ణయాత్మక విజయాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
సాక్షి నిరంతర విజయాన్ని ఆకాంక్షించిన శ్రీ మోదీ, భవిష్యత్తులో ఆమె మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“మహిళల 51 కేజీల బాక్సింగ్ ఈవెంట్‌లో సాక్షి ప్రతిష్ఠాత్మక స్వర్ణ పతకం గెలుచుకున్నారు! అద్భుతమైన ప్రదర్శనతో, నిర్ణయాత్మక విజయం సాధించినందుకు ఆమెకు అభినందనలు. సాక్షి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా!
A prestigious Gold for Sakshi in the Women’s 51 kg Boxing event! Congratulations to her on a commanding performance and a decisive victory. May she continue to scale greater heights!#CWG2026
— Narendra Modi (@narendramodi) August 1, 2026
**********
MJPS/SS/ST