Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి పుణ్యతిథి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి


మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి పుణ్యతిథి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. అద్భుతమైన దార్శనికతతో దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన అసాధారణ రాజనీతిజ్ఞుడని ప్రధానమంత్రి స్మరించుకున్నారు.

అటల్ జీ మాటలు, ఆయన చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఉంటాయన్నారు. అటల్ జీ నాయకత్వం మన దేశాన్ని బలోపేతం చేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సుపరిపాలన, ప్రజా సంక్షేమంపై ఆయనకున్న దృష్టి మనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

‘ఎక్స్’ వేదికగా, ఒక పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“అటల్ జీ పుణ్యతిథి సందర్భంగా వారిని స్మరించుకుందాం. ఆయన అద్భుతమైన దార్శనికత కలిగిన ఒక అసాధారణ రాజనీతిజ్ఞుడు. తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారు. ఆయన మాటలు, కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఉంటాయి. అటల్ జీ నాయకత్వం మన దేశాన్ని బలోపేతం చేసింది. సుపరిపాలన, ప్రజా సంక్షేమంపై ఆయనకున్న శ్రద్ధ మనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుంది.”

 

***