Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ పుట్టిన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ గోవింద్ ప్రజా జీవనంలో సుదీర్ఘ కాలం పాటు పాలుపంచుకున్నారని, ఆ కాలంలో భారత్ అభివృద్ధి, రాజ్యాంగంలో ఉల్లేఖించిన విలువలతో పాటు ప్రజల సంక్షేమం పట్ల కూడా తిరుగులేని నిబద్ధతను ఆయన చాటారని ప్రధానమంత్రి అన్నారు.
దేశ ప్రజలకు శ్రీ గోవింద్ ఉత్సాహంతో, నిరాడంబరంగా సేవలందించారని, ఈ కారణంగా సమాజంలో అన్ని వర్గాల వారి ఆదరణను ఆయన చూరగొన్నారని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ:
‘‘మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజా జీవనంలో ఆయన సుదీర్ఘ కాలం పాటు పాలుపంచుకున్నారు. ఆ కాలంలో భారత్ అభివృద్ధి, రాజ్యాంగంలో ఉల్లేఖించిన విలువలతో పాటు ప్రజల సంక్షేమం పట్ల తిరుగులేని నిబద్ధతతో నడుచుకున్నారు. దేశ ప్రజలకు ఎంతో ఉత్సాహంగా, నిరాడంబరంగా సేవలందించిన కారణంగా సమాజంలో అన్ని వర్గాల వారు ఆయనను ఆదరించారు.
ఆయనకు చక్కని ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు కలగాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.