Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథను ఆగస్టు 12న ఆవిష్కరించనున్న ప్రధానమంత్రి


భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్మై లైఫ్మై స్ట్రగుల్స్” శీర్షికతో ఉన్న పుస్తకాన్ని ఆగస్టు 12, 2026న ఉదయం 9:30 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.

భారత్‌లోని విశిష్టమైన ప్రముఖుల్లో ఒకరి జీవితాన్నిదేశానికి ఆయన అందించిన సేవలను వేడుకగా జరుపుకునే ప్రత్యేక కార్యక్రమమే ఈ పుస్తకావిష్కరణమాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ అసాధారణ జీవిత ప్రయాణాన్ని ఈ ఆత్మకథ వివరిస్తుందిబాల్యంలోని రోజులనుఆయన ఎదుర్కొన్న సవాళ్లనుసాధించిన విజయాలనుప్రజా జీవితాన్నిదేశ 14వ రాష్ట్రపతిగా అందించిన సేవలను ఈ పుస్తకం తెలియజేస్తుందిఆయన ప్రయాణంప్రజాసేవను తీర్చిదిద్దిన నైతిక విలువలుఅనుభవాలుపరిస్థితులను వివరిస్తుంది.

 

***