Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాల్‌దీవ్స్‌ అధ్య‌క్షులు శ్రీ‌ ఇబ్రాహిమ్ మొహ‌మద్ సోలిహ్ తో టెలిఫోన్ లో మాట్లాడి అభినందనలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న రిప‌బ్లిక్ ఆఫ్ మాల్‌దీవ్స్ అధ్య‌క్షులు మాన్య శ్రీ‌ ఇబ్రాహిమ్ మొహ‌మద్ సోలిహ్ తో టెలిఫోన్ లో మాట్లాడి, ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల లో మాల్‌దీవియ‌న్ డెమోక్రాటిక్ పార్టీ (ఎండిపి) సాధించిన విజ‌యం ప‌ట్ల ఆయ‌న కు అభినంద‌న‌ లు తెలియజేశారు.

ఎండిపి సాధించిన ప్రముఖ జ‌యం ఆ పార్టీ యొక్క నాయ‌కుల కృషి కి మ‌రియు పార్టీ విధానాల కు ల‌భించిన‌టువంటి సార్థక ఆమోదం అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. ఆ పార్టీ నాయ‌కులు మాల్‌దీవ్స్ ప్ర‌జ‌ల అభ్యున్న‌తి కోసం కంక‌ణ బ‌ద్ధులై పనిచేశార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. మాల్‌దీవ్స్ లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ విజ‌య‌వంతం గా ముగియడాన్ని ఆయన స్వాగతిస్తూ ఈ పరిణామం మాల్దీవ్ స్ లో ప్ర‌జాస్వామ్య ఏకీకరణ కు మ‌రియు ప్ర‌జాస్వామిక సంస్థ‌ల బ‌లోపేతానికి ఒక సంకేతం అన్నారు.

భార‌త‌దేశం త‌న ‘నేబ‌ర్‌హుడ్ ఫ‌స్ట్’ విధానాని కి అనుగుణం గా మాల్‌దీవ్స్ తో స‌న్నిహితం గా ప‌ని చేస్తూ ఇరు దేశాల భాగ‌స్వామ్యాన్ని మ‌రింత గా పెంపొందించడం తో పాటు మాల్‌దీవ్స్ యొక్క సామాజిక- ఆర్థిక అభివృద్ధి ఆవశ్యకతల మేర‌కు స‌హాయం చేస్తుంద‌ంటూ ప్ర‌ధాన మంత్రి పున‌రుద్ఘాటించారు.

పూర్వ అధ్య‌క్షులు శ్రీ‌ మొహ‌మ్మ‌ద్ న‌శీద్ తో కూడా ప్ర‌ధాన మంత్రి సంభాషించి ఎన్నిక‌ల లో ఘ‌న విజ‌యం సాధించినందుకు ఆయన ను అభినందించారు. మాల్‌దీవ్స్ లో ప్ర‌జాస్వామ్యం యొక్క మూలాల ను ప‌టిష్టప‌ర‌చ‌డం లో మరియు ప్ర‌జాస్వామ్యాన్ని ఇష్ట‌ప‌డే శ‌క్తులన్నీ భాగ‌ం పంచుకోవడాన్ని ప్ర‌ధాన మంత్రి కొనియాడారు. మ‌రి ఈ ల‌క్ష్య సాధ‌న లో భార‌త‌దేశం త‌నవంతు సాయాన్ని అందించ‌డాన్ని కొన‌సాగించగలద‌ని కూడా ఆయ‌న తెలియజేశారు.