పిఎంఇండియా
మొట్టమొదటి రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఈ సందర్భంగా ప్రధాన మంత్రి వందనం చేశారు.
” చరిత్రాత్మకమైన మొదటి రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. రాజ్యాంగం గురించి తెలుసుకునేందుకు ఈ ప్రత్యేక రోజు మీలో స్ఫూర్తి నింపుతుందని ఆకాంక్షిస్తున్నా.
మనం అంతా గర్వించదగిన రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఆవిశ్రాంతంగా శ్రమించిన గొప్ప మేధావులకు ఘనమైన నివాళి అందించేందుకే ఈ ప్రత్యేక దినం.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషిని గుర్తుచేసుకోకుంటే మన రాజ్యాంగం ప్రస్తావనే ఉండదు. రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఆయనకు వందనం.
మన రాజ్యాంగ విలువలను, సిద్ధాంతాలను గౌరవించాలి. మన పూర్వీకులు గర్వించదగిన భారతావనిని నిర్మించాలి ” అని ప్రధాని పేర్కొన్నారు.
Parliament all lit up on the eve of the 1st ever Constitution Day. pic.twitter.com/uje1RU2FJ6
— PMO India (@PMOIndia) November 25, 2015
Greetings to people of India on the historic occasion of 1st Constitution Day. May this day inspire you to know more about our Constitution.
— Narendra Modi (@narendramodi) November 26, 2015
This day is a tribute to all those great women & men who worked tirelessly to give India a Constitution we are very proud of.
— Narendra Modi (@narendramodi) November 26, 2015
No mention of our Constitution is complete without remembering the stellar contribution of Dr. Babasaheb Ambedkar. I salute him.
— Narendra Modi (@narendramodi) November 26, 2015
Let us always uphold the ideals & values of our Constitution & create an India that would make our founding fathers very proud.
— Narendra Modi (@narendramodi) November 26, 2015