Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యుఎస్ పూర్వ అధ్య‌క్షుడు శ్రీ జార్జ్ హెచ్‌.డ‌బ్ల్యు. బుశ్ మృతి కి సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


release id 186063
PM condoles the passing away of former US President George H .W. Bush

యుఎస్ పూర్వ అధ్య‌క్షుడు శ్రీ జార్జ్ హెచ్‌.డ‌బ్ల్యు. బుశ్ మృతి కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

“యుఎస్ పూర్వ అధ్య‌క్షుడు శ్రీ జార్జ్ హెచ్‌.డ‌బ్ల్యు. బుష్ మృతి ప‌ట్ల ఆయన కుటుంబ సభ్యులకు మరియు యుఎస్ఎ ప్ర‌జ‌ల‌కు ఇదే నా ప్రగాఢ సంతాపం. ఆయ‌న ప్ర‌పంచ చ‌రిత్ర లోనే ఒక క్లిష్టమైన కాలం లో కుశల రాజ‌నీతిజ్ఞుని భూమిక ను పోషించారు.

భార‌త‌దేశానికి, యుఎస్ఎ కు మ‌ధ్య బ‌ల‌మైన సంబంధాల విష‌యం లో పూర్వ అధ్య‌క్షుడు శ్రీ జార్జ్ హెచ్‌.డ‌బ్ల్యు. బుష్ ఎంతో ఉద్వేగాన్ని కనబరచే వారు. ఆయ‌న లేని లోటు తీర‌ని వేదన ను కలిగించేటటువంటిదే. ఆయ‌న ఆత్మ‌ కు ఈశ్వరుడు శాంతి ని ప్రసాదించుగాక” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.