Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రధానమంత్రి పర్యటన

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రధానమంత్రి పర్యటన


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అధికారిక పర్యటన చేపట్టారుఆయనకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ లాంఛనప్రాయంగా స్వాగతం పలికారు.
ఇద్దరు నాయకులు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారుఈ సందర్భంగా యూఏఈపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోందనీఆ దేశ నాయకత్వానికీప్రజలకూ సంఘీభావం తెలియజేస్తోందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారుప్రాంతీయంగా శాశ్వత శాంతికీస్థిరత్వానికీఇంధనఆహార భద్రతకు కీలకమైన హర్మూజ్ జలసంధి ద్వారా సురక్షితమైన రవాణానిరాటంకమైన నౌకాయానానికి హామీ ఇవ్వాలనే భారత దేశ స్పష్టమైన వైఖరిని కూడా తెలియజేశారు.
ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలను నాయకులు సమీక్షించారుఅలాగే ఇంధనంవాణిజ్యంపెట్టుబడులురక్షణభద్రతఫిన్‌టెక్మౌలికవసతులువిద్యసంస్కృతిప్రజా సంబంధాలతో సహా వివిధ రంగాల్లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవ్వడాన్ని స్వాగతించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నూతన శిఖరాలకు చేర్చేలా భారత్యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏసాధించిన విజయాన్ని వారు గుర్తించారు.

అభివృద్ధి చెందుతున్న ద్వైపాక్షిక ఇంధన భాగస్వామ్యాన్ని ఇరువురు నాయకులు ప్రశంసించారుముడి చమురుఎల్ఎన్‌జీఎల్పీజీ సరఫరాలతో సహా భారతదేశ ఇంధన భద్రతలో ముఖ్యమైన భాగస్వామిగా యూఏఈ కొనసాగుతుందిసమగ్ర ఇంధన భాగస్వామ్యం కోసం నూతన కార్యక్రమాలను ప్రోత్సహించాలని నాయకులిద్దరూ అంగీకరించారుఈ నేపథ్యంలో ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్అబుదుబాయ్ నేషనల్ ఆయిల్ సంస్థ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం ఖరారవ్వడాన్ని వారు స్వాగతించారుభారత వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను 30 మిలియన్ బ్యారళ్లకు పెంచేందుకుభారత్‌లో వ్యూహాత్మక గ్యాస్ రిజర్వులను ఏర్పాటు చేసే దిశగా కలసి పని చేసేందుకు ఉద్దేశించిన ఒప్పందమిదిదీర్ఘకాల ఎల్పీజీ సరఫరా కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్), అబుదుబాయ్ నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్ఓసీమధ్య కుదిరిన ఒప్పందాన్ని కూడా వారు స్వాగతించారు.

యూఏఈ సంస్థలు భారత్‌లో బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చేసిన ప్రకటనను ఇద్దరు నాయకులు స్వాగతించారువాటిలో ఎమిరేట్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఈఎన్‌డీబీఆర్‌బీఎల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో బిలియన్ అమెరికన్ డాలర్లుఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా (ఎన్ఐఐఎఫ్భాగస్వామ్యంతో భారత్‌లో చేపట్టే ప్రాధాన్య మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో నేషనల్ అబుదుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ (ఏడీఐఏ) 1 బిలియన్ యూఎస్ డాలర్లుసమ్మాన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాలో ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ బిలియన్ యూఎస్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నాయిద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూనే.. భారతదేశ వృద్ధి ప్రయాణంలో యూఏఈ ప్రదర్శిస్తున్న దీర్ఘకాల అంకితభావాన్ని ఈ పెట్టుబడులు స్పష్టం చేస్తున్నాయి.

సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో స్థిరమైనబలమైన ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యం ప్రధానాంశం అని నాయకులు గుర్తించారుగత పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సమగ్ర రక్షణ భాగస్వామ్య విధానంపై సంతకం చేయడాన్నివారు స్వాగతించారు. దీని పరిధిలో రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాన్నిఆవిష్కరణలుఅధునాతన సాంకేతిక పరిజ్ఞానంశిక్షణసైనిక విన్యాసాలునౌకా వాణిజ్య భద్రతసైబర్ భద్రతసురక్షితమైన కమ్యూనికేషన్లుసమాచారం వినిమయంలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు అంగీకరించారు.
ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేలా దిగువ పేర్కొన్న అదనపు ఒప్పందాలు నాయకుల సమక్షంలో ఖరారయ్యాయి.
· 
భారత ప్రభుత్వం ప్రారంభించిన నౌకావాణిజ్య అభివృద్ధి నిధి పథకం పరిధిలో వాడినార్‌లో ఆఫ్‌షోర్ ఫ్యాబ్రికేషన్‌తో సహా నౌకా మరమ్మతుల క్లస్టర్ నిర్మాణంలో కొచ్చిన్ షిప్‌యార్డ్దుబాయి సంస్థ డ్రైడాక్స్ వరల్డ్ మధ్య అవగాహన ఒప్పందం.  
· 
నౌకా మరమ్మతుల్లో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కొచ్చిన్ షిప్ యార్డ్డ్రైడాక్స్ వరల్డ్ దుబాయ్సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారీటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ (సీఈఎంఎస్మధ్య త్రైపాక్షిక ఒప్పందంఇది నైపుణ్యాలున్న నౌకా శ్రామిక శక్తిని సమీకరించడానికిశిక్షణఉపాధి అందించడానికి అవసరమైన విధానాన్ని ఏర్పాటు చేస్తుందిఅలాగే భారతీయ నౌకా శ్రామిక శక్తి సామర్థ్యాలను మెరుగుపరుస్తుందిఅదే విధంగా నౌకానిర్మాణంమరమ్మతుల్లో నిపుణులకు కేంద్రంగా భారతదేశాన్ని మారుస్తుంది.
· 
భారత్‌కు చెందిన సీడాక్యూఏఈకి చెందిన జీ-42 మధ్య ఎక్సాఫ్లాప్ సూపర్ కంప్యూట్ క్లస్టర్ ఏర్పాటుకు నిబంధనల పత్రం.

మైత్రి (మాస్టర్ అప్లికేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ రెగ్యులేటరీ ఇంటర్‌ఫేస్ఉపయోగించి వర్చువల్ వాణిజ్య కారిడార్‌ను కార్యాచరణలోకి తీసుకురావడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారుఈ డిజిటల్ వ్యవస్థ ఇరు దేశాలకు చెందిన కస్టమ్స్పోర్టు అధికారులను అనుసంధానించిసరకు రవాణా సజావుగా సాగేలా చూస్తుందిఖర్చులనురవాణా సమయాన్ని తగ్గించి మరింత సమర్థవంతమైన వాణిజ్యానికి వీలు కల్పిస్తుంది.
తనకు ఆత్మీయ స్వాగతంఆతిథ్యం అందించిన అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలియజేశారుత్వరలో భారత్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.

 

***