పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం యునైటెడ్ నేషన్స్ ఎన్ టిటీ ఆఫ్ జెండర్ ఈక్వలిటి అండ్ ఎంపవర్ మెంట్ ఆఫ్ విమెన్ (యుఎన్- విమెన్) కు, భారతదేశానికి మధ్య ఒక అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ఒయు)పై సంతకాలకు ఆమోదం తెలిపింది.
శాసనం, విధానాలు మరియ కార్యక్రమాల ద్వారా స్త్రీ- పురుష సమానత్వాన్ని పెంపొందించే అవకాశాలను అధికం చేయడానికిగాను పంచాయతి రాజ్ సంస్థ (పిఆర్ఐ)లతో సహా పాలన సంస్థల సామర్థ్యాలను పటిష్టపరచడంలో పంచాయతి రాజ్ మంత్రిత్వ శాఖకు సాంకేతికమైన మద్దతును అందించడం ఈ ప్రతిపాదనలోని ఉద్దేశంగా ఉంది.
పంచాయతి రాజ్ సంస్థ (పిఆర్ఐ) లలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, ఎన్నికైన మహిళా ప్రతినిధుల శక్తి సామర్ధ్యాలపై దృష్టి పెట్టి వారిని శక్తిమంతులను చేయడానికి, వారి దక్షతను పెంపొందించడానికి పంచాయతి రాజ్ మంత్రిత్వ శాఖ (ఎంఒపిఆర్ ), యుఎన్ -విమెన్ ఒకదానితో మరొకటి సమన్వయాన్ని ఏర్పరచుకొని కృషి చేశాయి. గతంలో ఒనగూరిన ఫలితాలను దృష్టిలో ఉంచుకొని పాలన ప్రక్రియలలో ప్రాతినిధ్య నమూనా దిశగా, జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్సును ప్రోత్సహించేందుకు చట్టాలు, విధానాలు, కార్యక్రమాలను సమర్ధంగా అమలుపరచడానికి ఈ రెండు పక్షాలు ఇక కలిసి పనిచేయనున్నాయి. సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు చేసే ప్రయత్నాలు సహా ఎమ్ఒపిఆర్ చొరవలు పరస్పర ప్రయోజనాలను అందించగలుగుతాయని, అంతే కాక సుపరిపాలన, స్త్రీ పురుష సమానత్వం మరియు మహిళల సాధికారిత ల పట్ల తాము కలసి ముందడుగు వేయడానికి దోహదం చేయగలవని ఇరు పక్షాలు అంగీకరించాయి. దీర్ఘ కాలంలో ఇది భారతదేశంలోని గ్రామీణ మహిళల స్థితిలో మెరుగుదలకు తోడ్పడగలుగుతుంది. అలాగే, కన్ వెన్శన్ టు ఎలిమినేట్ ఆల్ ఫోరమ్స్ ఆఫ్ డిస్ క్రిమినేషన్ అగైన్ స్ట్ విమెన్ (సిఇడిఎడబ్ల్యు), ద బీజింగ్ ప్లాట్ ఫామ్ ఫర్ యాక్షన్, మరియు ద సస్టెయినబుల్ డెవలప్ మెంట్ గోల్స్ పట్ల భారతదేశం చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినట్లు అవుతుంది కూడా.
యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ అసిస్టెన్స్ ఫ్రేమ్ వర్క్ (యుఎన్ డిఎఎఫ్) లో భాగంగా ఎం ఒ పి ఆర్ మరియు యుఎన్ -విమెన్ సంయుక్తంగా గుర్తించిన నిర్దిష్ట కార్యక్రమాల అమలులో కాలావధి లోపు ఫలితాలను సాధించడంలో ప్రతిపాదిత ఎమ్ఒయు తోడ్పాటును అందించగలదు. అలా ఈ ముఖ్యమైన భాగస్వామ్యం ఆచరణ రూపంలోకి రావడానికి ఈ ఎమ్ఒయు తన సహకారాన్ని అందించగలుగుతుంది.
ఈ ఎమ్ఒయు లో భాగంగా చేపట్టే కార్యకలాపాలను ఆరు రాష్ట్రాలు- ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్నాటక, రాజస్థాన్, మధ్య ప్రదేశ్- లలో జిల్లా మరియు ఉప జిల్లా స్థాయిలో అమలు చేయనున్నారు.