పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి యువజన వ్యవహారాలు, క్రీడల రంగాలలో భారతదేశానికి, పాలస్తీనా కు మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందాన్ని (ఎమ్ఒయు ను) తీసుకురావడం జరిగింది.
ఈ ఎమ్ఒయు ఉభయ దేశాలలో క్రీడల అభివృద్ధికి ఇది దోహదం చేయడంతో పాటు యువతీయువకులు వారి యొక్క కుల, మత, లింగ భేదాలతో సంబంధం లేకుండా వారి వారి ఆలోచనలను, విలువలను మరియు సంస్కృతిని ఆదాన ప్రదానం చేసుకోవడంలోనూ సహాయకారి అవుతుంది. తద్వారా, ఇది రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి తోడ్పడుతుంది.