పిఎంఇండియా
యు ఎన్ విమెన్ హీఫర్ శీ తపాలా బిళ్ళ సంయుక్త ప్రచారాన్ని గురించి కేంద్ర మంత్రిమండలి దృష్టికి తీసుకువచ్చారు. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ ప్రచారం కోసం తపాలా విభాగం, యునైటెడ్ నేషన్స్ పోస్టల్ అడ్మినిస్ట్రేషన్ (యు ఎన్ పి ఎ) కు మధ్య 2016 ఫిబ్రవరి నెలలో ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు)పై సంతకాలు జరిగాయి.
సంయుక్త ప్రచారంలో భాగంగా, అంతర్జాతీయ మహిళల దినాన్ని పురస్కరించుకొని 20 సీ-టినెంట్స్, ఇంకా 2 స్టాంపు లతో కూడిన మినియెచర్ షీట్ రూపాలలో స్టాంపులను ముద్రించడం జరిగింది.
యు ఎన్ విమెన్ హీఫర్ శీ ఉద్యమం లైంగిక సమానత్వం కోసం ఉద్దేశించిన ఒక పటిష్టమైన ఉద్యమం. సామాజిక వ్యవహారాలన్నింటిలో అందరికీ ప్రయోజనం సిద్ధించడం కోసం ప్రపంచ జనాభా లోని సగ భాగాన్ని సమర్ధించేటందుకు ప్రపంచ జనాభా లోని మిగతా సగ భాగాన్ని ఈ ఉద్యమం ఏకం చేస్తుంది. ఈ సంయుక్త అంశం ప్రపంచమంతటా మహిళల సశక్తీకరణ కోసం అంకితం అయినటువంటిదీ; లైంగిక సమానత్వమనే ఒక గొప్ప ఆశయాన్ని ప్రోత్సహించేటటువంటిదీనూ. ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం ఈ అంశాన్ని గట్టిగా సమర్ధిస్తూ వస్తున్నది కూడా. ఈ ప్రకారంగా తపాలా విభాగం, యు ఎన్ పి ఎ 2016 మార్చి 8 న అంతర్జాతీయ మహిళల దినాన్ని ఉత్సవంగా జరుపుకొనేందుకు మరియు స్మరించుకొనేందుకు ఒక ఉమ్మడి స్టాంపు ను విడుదల చేయాలని ఒక అంగీకారానికి వచ్చాయి.