Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యోగ అవార్డుల ప్ర‌దాన కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం


వేదిక ను అలంకరించిన నా మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడు శ్రీ శ్రీపద్ యెశో నాయక్, పుర‌స్కార గ్రహీత‌ లు, వృత్తి నిపుణులు, అధికారులు మ‌రియు ఆయుష్ రంగం తో అనుబంధాన్ని కలిగివున్న మ‌హిళ‌లు, స‌జ్జ‌నులారా,

దేశం లో ఫిట్ ఇండియా మూవ్ మెంట్ ఆరంభం అయిన మ‌రుస‌టి రోజే యోగా కు మ‌రియు ఆయుష్ కు సంబంధించినటువంటి కార్య‌క్ర‌మాని కి రావ‌డం, ఒక అద్భుతమైన యాదృచ్ఛిక ఘ‌ట‌న‌. ఆయుష్‌, యోగా లు ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ లోని అతి ప్ర‌ధాన‌ భాగస్వాములు.

ఈ రోజు న ఇక్కడ మూడు కార్య‌క్ర‌మాలు అవుతున్నాయి. రెండేమో మ‌న సంప్ర‌దాయం, మన వార‌స‌త్వం తాలూకు సత్కారం మరియు బహుమతుల తో సంబంధం కలిగిన కార్యక్రమాలు కాగా, మూడో కార్యక్రమం ఆరోగ్య సంర‌క్ష‌ణ సంబంధిత మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న తో జ‌త ప‌డిన‌టువంటిది. హరియాణా లో ఈ రోజు న 10 ఆయుష్ హెల్త్ ఎండ్ వెల్‌నెస్ సెంట‌ర్ లను మొదలుపెట్టడమైంది. దీనికి గాను హ‌రియాణా వాసుల కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

యోగ సాధకుల కు, యోగ కు సేవ‌ల ను అందజేస్తున్న వారికి, మ‌రి ప్ర‌పంచ‌వ్యాప్తం గా యోగా ను ప్రోత్స‌హిస్తున్న సంస్థ‌ల కు, మిత్రుల కు పురస్కారాల ను అందజేసే అవ‌కాశం కూడా నాకు ల‌భించింది. ద‌శాబ్దాలు గా యోగా ను ప్రోత్స‌హించ‌డం లో భాగం పంచుకొన్న జ‌పాన్ కు, ఇటలీ కి చెందిన వారు కూడా ఈ కార్య‌క్ర‌మాని కి విచ్చేశారు. ఎంటోనియెటా రొజ్జి స‌ర్వ యోగ ఇంట‌ర్‌నేశ‌న‌ల్ ద్వారా యోగ ను గ‌త 4 ద‌శాబ్దాలు గా యూరోప్ అంత‌టా ప్రోత్స‌హిస్తున్నారు. అదే విధంగా, జ‌పాన్ యోగ నికేత‌న్ జ‌పాన్ అంతటా వేలాది యోగా కేంద్రాల ను న‌డుపుతోంది. ఈ సంస్థ యోగ స‌హాయం తో గ‌త నాలుగు ద‌శాబ్దాలు గా జ‌పాన్ రోగాల బారి న ప‌డ‌కుండా చూస్తోంది. పురస్కారాలను అందుకొన్న వారిని అందరి ని నేను అభినందిస్తూ, వారు మ‌రిన్ని సాఫ‌ల్యాల ను సాధించాలి అని అభిల‌షిస్తున్నాను.

ఆయుష్ వ్య‌వ‌స్థ ను సుసంప‌న్నం చేసిన 12 మంది గౌర‌వార్థం ఒక త‌పాలా బిళ్ళ ను కూడా కొద్దిసేప‌టి క్రితం విడుదల చేయ‌డ‌ం జరిగింది. వారు ప్ర‌జ‌ల రోగ చికిత్స కోసం వారి యొక్క యావ‌త్తు జీవితాల ను అంకితం చేశారు.

కొంత మంది యోగ ను ఒక మాధ్య‌మం గా ఎంచుకొంటే, మ‌రి కొంద‌రు ఆయుర్వేదాన్ని ఎంచుకొన్నారు. ఇంకొంద‌రు యూనానీ తో ప్ర‌జ‌ల కు సేవ‌ చేశారు. మ‌రికొంద‌రు హోమియోప‌థి తో ప్ర‌జ‌ల జీవనాన్ని రోగాల బారిన ప‌డ‌కుండా చూశారు.

ఒకే సెట్ లో 12 స్టాంపుల ను జారీ చేయడం అనేది భార‌త‌దేశం లో అరుదుగా జరిగినటువంటి ఘ‌ట‌న‌. దీనికి గాను త‌పాలా విభాగాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ త‌పాలా బిళ్ళ‌ లు ఆయుష్ అంటే దేశ ప్ర‌జ‌ల లో కొత్త ఆలోచ‌నలు బయలుదేరడానికి తోడ్పాటు ను అందిస్తాయన్న న‌మ్మకం నాలో ఉంది.

ఈ రోజు న జారీ చేసిన త‌పాలా బిళ్ళ‌ల‌ లో ఒక‌టి శ్రీ దిన్‌ శా మెహ‌తా ను గౌర‌వించ‌డం కోసం ఉద్దేశించింది. దిన్‌ శా మెహ‌తా గారు తన జీవితాన్ని నేచరోప‌థి కి స‌మ‌ర్పించిన కార్య‌క‌ర్త‌. అంతేకాదు, గాంధీజీ కి వైద్యుడు గా కూడా ఆయన ఉండే వారు.

గాంధీజీ ఏమని అనేవారంటే- ‘‘నేచరోప‌థి ఒక జీవ‌న మార్గం, అంతే త‌ప్ప అది ఏదో రోగ చికిత్స విధానం కాదు’’ అని. ఆయ‌న జీవన పర్యంతం దీని ని ఆచరణ లో పెట్టారు. అంతేకాక, ప్రాకృతిక చికిత్స పద్ధతి ని జీవ‌నాని కి ఒక ఆధారం గా చేసుకొన్నారు.

గాంధీ గారు నేర్చుకొన్న‌ది ఏమిటంటే, అది భార‌త‌దేశం లో నిరోధ‌క మ‌రియు నివార‌క ఆరోగ్య సంర‌క్ష‌ణ తో సంబంధం ఉన్న‌టువంటి సుసంప‌న్న‌ వార‌స‌త్వం. మ‌న‌ దగ్గర వేల సంవ‌త్స‌రాల పురాతనమైన సాహిత్యం ఉంది. వేదాల లో గంభీరమైన వ్యాధుల కు సంబంధించిన చికిత్స‌ ను గురించిన ప్రస్తావన ఉంది. కానీ దుర‌దృష్టవ‌శాత్తూ మ‌నం మ‌న ఈ యొక్క పురాతన ప‌రిశోధ‌న ను, జ్ఞానం యొక్క ఈ ఖజానా ను ఆధునిక‌త తో ముడిపెట్ట‌డం లో సఫలం కాలేక‌పోయాము.

ఈ స్థితి ని మార్చ‌డానికి గ‌త 5 సంవ‌త్స‌రాల కాలం లో మేము ప్ర‌య‌త్నించాము. దీని లో భాగం గా, ఆయుష్ ను భార‌త‌దేశ ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ లో ఒక ముఖ్య భాగం చేయ‌డం పై శ్ర‌ద్ధ వ‌హించడం జరుగుతోంది.

ఆయుష్ పరివారం లో సోవా రిగ్‌పా సిస్టమ్ ను చేర్చిన‌ట్లు నా దృష్టి కి వ‌చ్చింది. ఆయుర్వేదం, యోగ, నేచరోప‌థి, యూనానీ, సిద్ధ‌, ఇంకా హోమియోప‌థి ల త‌రువాత సోవా రిగ్‌పా అనేది ఆయుష్ కుటుంబం లో ఆరో స‌భ్యురాలు అయిపోయింది. దీనికి గాను మీకు హృద‌యపూర్వ‌క అభినంద‌న‌లు.

భార‌త‌దేశం యొక్క ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ లో పరివర్తన ను తీసుకు రావాలి అంటే గ‌నుక అటువంట‌ప్పుడు మ‌నం సమగ్ర‌మైనటువంటి ఆలోచ‌న విధానం తో ప‌ని చేయ‌వ‌ల‌సి ఉంటుంది. సాంప్ర‌దాయ‌క రోగ చికిత్స మ‌రియు ఆధునిక రోగ చికిత్స ల ఉమ్మ‌డి శ‌క్తి ని బ‌లోపేతం చేసుకోవ‌ల‌సివుంటుంది. ఆయుష్ ను, ఆధునిక ఆరోగ్య సంర‌క్ష‌ణ ను స‌మాన‌మైన స్థాయి లో జ‌మిలి గా అభివృద్ధి పరచ కలిగితే, అప్పుడు ఉత్త‌మ‌మైన ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌రిష్కార మార్గాల ను మ‌నం రూపొందించ‌ కలుగుతాము.

ఈ ఆలోచ‌న నుండి జ‌నించిందే ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న‌. దీనిలో భాగం గా ముందుజాగ్రత్త చర్యల తో కూడినటువంటి ఆరోగ్య సంర‌క్ష‌ణ ను దృష్టి లో పెట్టుకొని ఒక ప‌క్క హెల్త్ ఎండ్ వెల్‌నెస్ సెంట‌ర్ లను ఏర్పాటు చేయ‌డం, మ‌రో ప‌క్క పిఎం జ‌న్ ఆరోగ్య యోజ‌న ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతున్నాయి.

ఈ యొక్క హెల్త్ ఎండ్ వెల్‌నెస్ సెంట‌ర్ల న‌మూనా తో పాటు, నివార‌క మ‌రియు త‌క్కువ ఖ‌ర్చుతో కూడి ఉండే ఆరోగ్య సంర‌క్ష‌ణ ఇది వ‌ర‌కు ఎన్న‌డూ ఎరుగ‌నిది. ఈ కేంద్రాల లో నివార‌ణ తో పాటు, న‌యం చేసే చ‌ర్య‌లు కూడా ఉన్నాయి.

దేశం లో ఒక ల‌క్షా యాభై వేల హెల్త్ ఎండ్ వెల్‌నెస్ సెంట‌ర్ లను ఆరంభిస్తూనే, మేము ఆయుష్ ను మరచిపోలేదు. మేము దేశం అంత‌టా 12 వేల అయిదు వందల ఆయుష్ సెంట‌ర్ లను నిర్మించాలన్న ల‌క్ష్యాన్ని నిర్దేశించుకొన్నాము. వీటిలో భాగ‌మైన 10 ఆయుష్ హెల్త్ ఎండ్ వెల్‌నెస్‌ సెంట‌ర్ లను ఈ రోజు న ప్రారంభించ‌డ‌ం జరిగింది. ఈ సంవ‌త్స‌రం లోపు 4000 ఆయుష్ సెంట‌ర్ లను సిద్ధం గా ఉంచాల‌ని మేము కృషి చేస్తున్నాము.

చౌక గురించిన ప్ర‌స్తావ‌న వ‌చ్చింది అంటే, ఆయుష్మాన్ భార‌త్ పేద‌ల లో కెల్లా పేద‌లైన వారికి ఉత్త‌మ‌మైన ఆరోగ్యాన్ని అందించే భరోసా ను ఇచ్చింది. ఇంత‌వ‌ర‌కు ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం లో భాగం గా ఉచిత రోగ చికిత్స ను అందుకొన్న రోగులు అంద‌రూ దీని ప‌రిధి లోకి రాక‌పోతే గ‌నుక 12 వేల కోట్ల రూపాయ‌ల కు పైగా మొత్తాన్ని వారు ఖర్చు పెట్టవ‌ల‌సి వ‌చ్చేది. ఒక ర‌కం గా, దేశం లోని ల‌క్షలాది పేద‌ల కుటుంబాల కు 12,000 కోట్ల రూపాయ‌లు ఆదా అయ్యాయి అన్న మాట.

ఆయుష్మాన్ భార‌త్ వంటి ప‌థ‌కం ఏదీ లేన‌ప్పుడు పేద‌ల కు చికిత్స ను పొంద‌డం ఎంత క‌ష్ట‌మో మీరు ఊహించ వ‌చ్చును. చికిత్స కు అయిన వ్య‌యం వారి ని మ‌రింత పేద‌ల్ని చేసేసేది.

ఆరోగ్య సంరక్షణ కోసమని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మ‌రియు త‌క్కువ ఖ‌ర్చు లో చికిత్సల‌ కు తోడు, దేశం లో అవ‌స‌ర‌మైన‌టువంటి మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న తాలూకు ప‌నులు కూడా పురోగ‌మిస్తున్నాయి. రెండు రోజుల కింద‌ట దేశ వ్యాప్తం గా 75 నూత‌న వైద్య క‌ళాశాల‌ల‌ ను సైతం ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దేశం లోని ప్ర‌తి ఒక్క జిల్లా లో ఒక వైద్య క‌ళాశాల‌ ను స్థాపించాలి అనే ల‌క్ష్యం దిశ గా వేసిన‌టువంటి మ‌రొక పెద్ద అడుగు ఇది.

ఇది తీవ్ర వ్యాధుల చికిత్స కోసం అవ‌స‌ర‌మైన స‌దుపాయాల‌ ను పెంచ‌డం మాత్ర‌మే కాకుండా, ఎంబిబిఎస్ కోర్సు కు సీట్ల సంఖ్య ను కూడా దాదాపు 16 వేల మేర‌కు పెంచేట‌టువంటిది. ఇటీవ‌లే చ‌ట్ట రూపాన్ని సంతరించుకొన్నటువంటి నేశ‌న‌ల్ మెడిక‌ల్ క‌మిశ‌న్ యాక్ట్ సైతం దేశం లో వైద్య విద్య మ‌రియు సంబంధిత మౌలిక సౌక‌ర్యాల కు ఊతాన్ని అందించ‌డం లో ప్రభావశీలమైనటువంటి పాత్ర‌ ను పోషించ‌నుంది.

ఆధునిక మందులే కాకుండా మ‌రింత మంది ఉత్త‌మ వృత్తి నిపుణులు ఆయుష్ రంగం లోకి వ‌చ్చే విధం గా చూడ‌డం కోసం ఆయుష్ విద్య వ్య‌వ‌స్థ లో అవ‌స‌ర‌మైన సంస్క‌ర‌ణ‌ల ను తీసుకురావడం జరుగుతోంది. మ‌రీ ముఖ్యం గా సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఏ విధం గా ఉపయోగించుకోవడం జరుగుతోంది అంటే, అది ఆయుష్ ను భ‌విష్య‌త్తు కోసం స‌న్న‌ద్ధం చేయ‌గ‌లుగుతుంది. ఆయుష్ గ్రిడ్ అనే ఆలోచ‌న కూడా ప్రశంసనీయమైందే. దీని తో ఆయుష్ రంగం తో ముడిప‌డిన‌టువంటి ఎక్క‌డిక‌క్క‌డ గోడ‌లు క‌ట్టుకొనే మ‌న‌స్త‌త్వాన్ని తొల‌గించ‌డం లో తోడ్పాటు అందుతుంది.

ఆయుష్, ఇంకా వైద్య సంబంధ అధునాత‌న మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ప్ర‌యోజ‌నాలు విస్తృతమైనటువంటివి అని చెప్పాలి. ఆరోగ్య సంర‌క్ష‌ణ తో పాటే భార‌త‌దేశం లో ఉపాధి క‌ల్ప‌న అవ‌కాశాల ను పెద్ద ఎత్తున కల్పించడం లో ఇవి దోహదపడగలవు.

మరీ ముఖ్యం గా చిన్న చిన్న పల్లెల్లో, టియర్- 2, టియర్- 3 పట్టణాల లో ఇంటి కి ద‌గ్గ‌ర‌లోనే వైద్య విద్య ను మ‌రియు పారామెడిక‌ల్ ఎజుకేశన్ ను అభ్యసించే అవ‌కాశం కూడా రూపుదాల్చింది.

కొత్త ఆసుప‌త్రుల ఏర్పాటు తో వైద్యం తో పెనవేసుకొన్న ఒక సంపూర్ణ ఇకోసిస్టమ్ అక్కడ అభివృద్ధి చెందుతోంది. దీని ప‌ర్య‌వ‌సానం గా త‌క్కువ స్థాయి విద్య ను మాత్రమే అభ్యసించిన వారు మొద‌లుకొని డిప్లొమా నో, డిగ్రీ నో చదివిన వారి కి సైతం నూత‌న ఉద్యోగ అవ‌కాశాలు లభిస్తున్నాయి.

ఇవాళ, 5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువ గ‌ల ఆర్థిక వ్య‌వ‌స్థ గా మారే ల‌క్ష్యం దిశ గా మనం ప‌య‌నిస్తున్న క్ర‌మం లో, ఈ ప్ర‌స్థానం లో ఆయుష్ ఒక ప్ర‌ధాన‌మైన పాత్ర ను పోషించ‌నుంది. రానున్న కొన్ని సంవ‌త్స‌రాల లో భార‌త‌దేశం లో ప్రివెంటివ్ హెల్త్ కేర్ విప‌ణి కూడా ఎంతో విస్త‌రించబోతోంది. ఇది ఒక మ‌హా అవ‌కాశం.

మ‌నం మ‌న ప్రివెంటివ్ హెల్త్ కేర్ సిస్ట‌మ్ ను యావ‌త్తు ప్ర‌పంచానికి ఒక ఆక‌ర్ష‌ణీయ‌మైన బ్రాండు గా అభివృద్ధి ప‌ర‌చుకోవాలి. ప్ర‌పంచం లో 17 దేశాల తో మ‌నం ఒప్పందాల‌ ను కుదుర్చుకున్నాము. ఈ ప్ర‌క్రియ‌ ను మ‌రింత వేగ‌వంతం చేసుకోవ‌ల‌సిన ఆవ‌శ్య‌క‌త ఉంది.

ఇవాళ, ప్ర‌పంచవ్యాప్తం గా యోగ జీవితం లో ఒక ముఖ్య‌మైన భాగం గా మారిపోయింది. గ‌డ‌చిన 5 సంవ‌త్స‌రాల‌ లో అంత‌ర్జాతీయ యోగ దినం సంద‌ర్భం గా యోగ ప‌ట్ల వ్య‌క్త‌మైన కుతూహ‌లం ప్ర‌పంచం లో ఇదివ‌ర‌కు క‌ని విని ఎరుగ‌న‌టువంటిది. ప్ర‌స్తుతం యోగ స్వ‌స్థ‌త తో ముడిప‌డిన గొప్ప మాధ్య‌మం గా నే కాక ప్ర‌పంచాన్ని భార‌త‌దేశం తో సంధానించిన మాధ్య‌మం గా కూడా రూపుదాల్చుతున్నది.

ఇప్పుడు మనం యోగా కు తోడు గా ఆయుష్ యొక్క ఇత‌ర రూపాల‌ ను కూడా ప్ర‌పంచం అంతటి కి చేర్చే ప్ర‌య‌త్నాలు చేయ‌వ‌ల‌సి ఉంది.

మ‌నం మ‌న ప్రాచీన సంప్ర‌దాయాల ను మ‌ర‌చిపోవడాన్ని, వేరే ఎవరో మన కు వాటిని గురించి చెప్పే లోపే మనమే మన అలవాటు ను మార్చుకొని వాటి ని స‌రికొత్త‌ గా నేర్చుకొనే ప్ర‌య‌త్నాన్ని చేయాలి.

నేను మీకు ఒక ఉదాహ‌ర‌ణ ను ఇస్తాను.

ఈ రోజు న మ‌నం చూస్తున్నాం, ఏదంటే, మ‌నం వ‌ద‌లివేసిన ఆహారాన్ని ప్ర‌పంచం తాను స్వీక‌రించ‌డం మొద‌లు పెట్టింది. బార్లీ, జొన్న‌, రాగి, సామ‌లు, కోదో, త‌దిత‌ర తృణ ధాన్యాలు ఒకప్పుడు మ‌న ఆహారం లో భాగం గా ఉండేవి. కానీ, క్ర‌మం గా అవి మ‌న భోజ‌న ప‌ళ్ళేల‌ లో నుండి మాయ‌మ‌య్యాయి. ఈ ఆహారాన్ని పేద‌రికం తో ముడివేయడం జ‌రిగింది.

ప్ర‌స్తుతం ఇదే పోష‌కాహారాని కి ప్ర‌పంచం అంత‌టా గిరాకీ నెల‌కొన‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చును. నేటి రోజుల లో మ‌నం ఆన్‌ లైన్ శాపింగ్ పోర్ట‌ల్స్ ను సంద‌ర్శించిన‌ప్పుడు, మ‌నం త‌ర‌చు గా ఆశ్చ‌ర్యానికి లోన‌వుతున్నాము. ఉచితం గా తీర్చుకోవ‌డానికి కూడా ముందుకు రాన‌టువంటి తిండి గింజ‌ల‌ ను కిలో కు వంద‌ల రూపాయ‌ల ధ‌ర‌ల‌ కు విక్ర‌యించ‌డం జ‌రుగుతోంది.

మ‌రి ఇప్పుడు పోష‌క విలువ‌లు క‌లిగిన ఈ ఖ‌జానా ను తిరిగి నింప‌వ‌ల‌సిన స‌మ‌యం తిరిగి వ‌చ్చింది. దేశం చిరు ధాన్యాల విప్ల‌వం విష‌యం లో క‌ఠోరంగా శ్ర‌మించవ‌ల‌సివున్నది. రైతులు చిరుధాన్యాల ను పండించాలి. మ‌న ప‌రిశ్ర‌మ‌లు మిలిట్ తో ఆక‌ర్ష‌ణీయ‌మైన ఉత్ప‌ాదనల‌ ను త‌యారు చేయవచ్చు. వీటి ని ప్ర‌తి ఒక్క త‌రం వారు ఇష్టం గా స్వీక‌రిస్తారు.

ముఖ్య‌మైన సంగ‌తి ఏమిటి అంటే, జొన్న‌లు, మొక్క‌జొన్న‌లు అన్ని ర‌కాల నేల‌ల్లోను పండుతాయి. అవి నీటి ని కూడా త‌క్కువే తీసుకొంటాయి. అంటే భార‌త‌దేశాని కి గొప్ప అనుకూల‌త ఉందన్న మాట‌. మ‌నం ప్ర‌పంచాని కి అంతటికి సరిపడ చిరు ధాన్యాల‌ ను పండించ‌గ‌లం.

ఇది భార‌త‌దేశం ప్రివెంటివ్ హెల్త్ కేర్ బ్రాండ్ గా అవ‌త‌రించ‌డం లో స‌హాయం చేయ‌గ‌లుగుతుంది. ఇది మాన‌వ జాతి కి సేవ చేయ‌డం లో మ‌రియు రైతుల ఆదాయాన్ని పెంచ‌డం లో కూడా తోడ్ప‌డుతుంది.

ఆయుష్ తాలూకు మ‌రొక ముఖ్య‌మైన అంశం కూడా ఉంది. దీని విషయం లో మ‌నం గంభీర క‌స‌ర‌త్తు ను చేయవలసివుంది. భార‌త‌దేశం లో వైద్య సంబంధ ప‌ర్య‌ట‌న‌లు నిరంత‌రాయం గా వృద్ధి చెందుతున్నాయి. అయిన‌ప్ప‌టి కీ కూడాను మ‌రెంతో అవ‌కాశం ఉంది. వైద్యాని కి, మెడిటేశన్ కు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల ను రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌హాయం తో అభివృద్ధి ప‌ర‌చ‌డం జ‌రుగుతున్నది.

ఈ విష‌యం లో వివిధ మంత్రిత్వ శాఖ‌ల‌ ను, విభాగాల‌ ను సంప్ర‌దించ‌వ‌ల‌సింది గా ఆయుష్ మంత్రిత్వ శాఖ‌ ను నేను ప్ర‌త్యేకం గా అభ్య‌ర్ధిస్తాను. మ‌నం మెడిక‌ల్ టూరిజ‌మ్ ను దేశం లోని ప్ర‌తి ఒక్క ప్రాంతాని కి, ప్రత్యేకం గా ఈశాన్య ప్రాంతాని కి తీసుకు పోవాలి.

ఈ ప్ర‌య‌త్నాల‌న్నింటినీ మ‌నం క‌ల‌సిక‌ట్టుగా చేసిన నాడు మ‌న సాంప్ర‌దాయ‌క వైద్య ప‌ద్ధ‌తులు మంచి ఆరోగ్యాన్ని ప్ర‌సాదించ‌డం ఒక్క‌టే కాకుండా, 21వ శతాబ్ద‌పు భార‌త‌దేశం ..అదే న్యూ ఇండియా.. కోసం సౌభాగ్యాన్ని కూడా అందిస్తాయి. చివ‌ర‌ గా, మ‌రొక్క‌ మారు అవార్డు గెలుచుకొన్న అందరికీ అభినంద‌న‌ లు తెలియ‌ జేస్తున్నాను.

మీరు ప్ర‌స్తుతం చేస్తున్న ప‌నినే కొన‌సాగిస్తూ, దేశాన్ని, ప్ర‌పంచాన్ని ప‌టుత్వం తో ఉంచాలి. ఈ అభిలాష తో, మీ అంద‌రికీ నా యొక్క కృత‌జ్ఞ‌త ను వ్య‌క్తం చేస్తున్నాను.

మీకు ధ‌న్య‌వాదాలు.