పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రక్షణ పురస్కారాల ప్రదానోత్సవం- 2026 (ఒకటో దశ)లో పాల్గొన్నారు. మన వీర జవానులకు శౌర్య పురస్కారాలను ఈ కార్యక్రమంలో ప్రదానం చేశారు.
వారు దేశ రక్షణలో కనబరిచిన అసాధారణ ధైర్య, సాహసాలు, కర్తవ్యనిష్ఠ, నిస్వార్థ సేవ గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘రక్షణ పురస్కారాల ప్రదానోత్సవం- 2026 (ఒకటో దశ)లో పాలుపంచుకున్నాను. మన వీర జవానులకు శౌర్య పతకాలను ఆ కార్యక్రమంలో ప్రదానం చేశారు. వారు దేశ రక్షణలో కనబరిచిన అసాధారణ ధైర్య, సాహసాలను, కర్తవ్యనిష్ఠ ని, నిస్వార్థ సేవ ని చూసి మనమంతా గర్వపడుతున్నాం’’ అని పేర్కొన్నారు.
Attended the Defence Investiture Ceremony 2026 (Phase-1) where Gallantry Awards were conferred upon our brave personnel. We are proud of their extraordinary courage, commitment and selfless service to the nation. pic.twitter.com/kvnW6dmXwa
— Narendra Modi (@narendramodi) June 8, 2026