Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ తో టెలిఫోన్ లో మాట్లాడారు.

ఉక్రెయిన్ కు సంబంధించిన తాజా పరిణామాలను అధ్యక్షుడు పుతిన్ ప్రధానికి వివరించారు.

తాజా పరిస్థితులు గురించి వివరంగా సమాచారం అందించినందుకు అధ్యక్షుడు పుతిన్ కు శ్రీ మోదీ ధన్యవాదాలు తెలుపుతూఈ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కావాలనే భారత్‌ స్థిరమైన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.

ద్వైపాక్షిక అంశాల అమలులో పురోగతిని కూడా ఇరువురు నేతలు సమీక్షించారు.  రెండు దేశాల మధ్య ప్రత్యేకమైనప్రాధాన్యత కలిగిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

ఈ ఏడాది చివర్లో జరిగే 23వ భారత్రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్ కు రావాలని పుతిన్ ను ప్రధాని ఆహ్వానించారు.

 

***