Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాంచీ లో ఆయుష్మాన్ భార‌త్ ల‌బ్ధిదారుల తో ప్ర‌ధాన మంత్రి ముఖాముఖి

రాంచీ లో ఆయుష్మాన్ భార‌త్ ల‌బ్ధిదారుల తో ప్ర‌ధాన మంత్రి ముఖాముఖి

రాంచీ లో ఆయుష్మాన్ భార‌త్ ల‌బ్ధిదారుల తో ప్ర‌ధాన మంత్రి ముఖాముఖి

రాంచీ లో ఆయుష్మాన్ భార‌త్ ల‌బ్ధిదారుల తో ప్ర‌ధాన మంత్రి ముఖాముఖి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2019వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 17వ తేదీన ఝార్‌ఖండ్ లోని రాంచీ ని సంద‌ర్శించారు. ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న‌ ల‌బ్దిదారుల లో కొంత మంది తో ఆయ‌న ముఖాముఖి సంభాషించారు. ఝార్‌ఖండ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీమతి ద్రౌపది ముర్ము తో పాటు ఝార్‌ఖండ్ ముఖ్య‌మంత్రి శ్రీ ర‌ఘుబ‌ర్ దాస్ కూడా ఈ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొన్నారు.

ప్ర‌ధాన మంత్రి అదే రోజు న అంతక్రితం ఝార్‌ఖండ్ లోని హ‌జారీబాగ్ లో మాట్లాడుతూ, ఝార్‌ఖండ్ నివాసుల లో వేల మంది సహా దేశ‌ వ్యాప్తం గా ల‌క్ష‌లాది ప్ర‌జానీకాని కి ల‌బ్ది ని చేకూర్చిన ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న ఆరంభమైంది ఝార్‌ఖండ్ లోనే అన్నారు. ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018వ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 23వ తేదీన ‘ప్ర‌ధాన మంత్రి జ‌న ఆరోగ్య యోజ‌న – ఆయుష్మాన్ భార‌త్’ను రాంచీ లో ప్రారంభిస్తూ ఈ ప‌థ‌కాన్ని ‘‘పేద‌ల కు సేవ చేయ‌డం లో ఆట నియమాన్ని మార్చివేసే కార్య‌క్ర‌మం’’గా అభివ‌ర్ణించారు.

పెద్ద ఆప‌ద త‌లెత్తిన‌ప్పుడు ఆసుప‌త్రి సంద‌ర్శ‌న ల కారణంగా పేద‌లు మ‌రియు బ‌ల‌హీన వ‌ర్గాల వారి పై ప‌డే ఆర్థిక భారాన్ని త‌గ్గించ‌డమే కాక నాణ్య‌మైన ఆరోగ్య సేవ‌ల‌ ను వారి కి అందుబాటు లోకి తీసుకు రావాల‌నేది ‘ప్ర‌ధాన మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న (పిఎం-జెఎవై)’ ధ్యేయం గా ఉంది. ఈ ప‌థ‌కం ఒక్కో కుటుంబాని కి ప్ర‌తి ఏటా 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఆరోగ్య హామీ కి పూచీ ప‌డుతుంది. 50 కోట్ల మంది కి పైగా ప్ర‌జ‌ల కు ల‌బ్ధి ని చేకూర్చే ఈ ప‌థ‌కం ప్ర‌పంచం లో అత్యంత భారీదైన‌టువంటి ఆరోగ్య హామీ ప‌థ‌కం గా ఉంది. ఈ ప‌థ‌కం యొక్క ల‌బ్దిదారుల సంఖ్య దాదాపు గా యూరోపియ‌న్ యూనియ‌న్ జ‌నాభా కు సమానం గా గాని, లేదా అమెరికా, కెన‌డా, ఇంకా మెక్సికో.. ఈ మూడు దేశాల జ‌నాభా ను కలిపితే వచ్చే సంఖ్య కు దాదాపు గా సమానం గా గాని ఉంటుంది.