Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాణీ రశ్మోనీ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి


రాణీ రశ్మోనీ జయంతి ఈ రోజు. ఈ  సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమెకు నివాళులు అర్పించారు. సాహసం, కరుణ, దృఢ విశ్వాసాల సమున్నత ప్రతీక రాణీ రశ్మోనీ అని శ్రీ మోదీ కొనియాడారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘సాహసానికి, కరుణకు, దృఢ విశ్వాసానికీ ప్రతీకగా నిలిచిన మహోన్నత మూర్తి రాణీ రశ్మోనీ. ఆమెను దూరదృష్టి ఉన్న నేతగాను, దాతగాను ఆప్యాయంగా స్మరించుకుంటాం. ఆమె కలకాలం నిలిచే సంస్థలను ఏర్పాటు చేయడమే కాకుండా, పేదప్రజల అభ్యున్నతి, ఆధ్యాత్మికతల పట్ల అచంచల నిబద్ధతను చాటారు. రాణీ రశ్మోనీ జయంతి సందర్భంగా ఆమెకు నేను నివాళులు  అర్పిస్తున్నాను.’’అని పేర్కొన్నారు. 

 

***