Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రప‌తి ప్ర‌సంగాని కి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానాని కి లోక్ స‌భ లో ప్ర‌ధాన మంత్రి ఇచ్చిన స‌మాధానం లోని ముఖ్యాంశాలు


రాష్ట్రప‌తి ప్ర‌సంగాని కి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు లోక్ స‌భ లో జ‌వాబిచ్చారు. ప్ర‌ధాన మంత్రి త‌న మ‌నోభావాల‌ ను ట్విట‌ర్ లో వెల్ల‌డిస్తూ, ఈ కింది విధం గా పేర్కొన్నారు:

“ప్ర‌భుత్వం భార‌త‌దేశ ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసి తీరాలి. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ ల ప‌ట్ల స్పంద‌నను కలిగివుండాలి. అవినీతి కి ఏ మాత్రం తావు లేదు.

పార్ల‌మెంటు లో జ‌రిగిన చ‌ర్చ లో ఎంతో మంది స‌భ్యులు పాలుపంచుకున్నారు. వారంద‌రి కీ నేను ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను.

2019వ సంవ‌త్స‌ర పార్ల‌మెంటు ఎన్నిక‌ల లో తొలి సారి గా వోటు హ‌క్కు ను వినియోగించుకొనే వారంద‌రి కీ ఇవే నా అభినంద‌న‌లు. 21వ శ‌తాబ్దం లో పుట్టిన వారు ప్ర‌స్తుతం వోట‌ర్లు కానున్నారు. ఈ విధం గా వారు భార‌త‌దేశం యొక్క పురోగ‌తి ని తీర్చిదిద్ద‌డం లో ఒక పాత్ర ను పోషించ‌బోతున్నారు.

మ‌న దేశాన్ని ముందుకు తీసుకు పోయేవి విశ్వాసం మ‌రియు ఆశావాదాలే. మేం స‌వాళ్ళ నుండి ప‌లాయ‌నం చిత్త‌గించే ర‌కం కాదు. మేం స‌వాళ్ళ ను ఎదుర్కొని, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ ను నెర‌వేర్చ‌డం కోసం ప‌ని చేస్తాం.

కాంగ్రెస్ లో ఉన్న మిత్రులు రెండు కాలావ‌ధుల్లో విష‌యాల‌ ను చూస్తారు. వాటి లో.. ఒక‌టి క్రీ.పూ. – కాంగ్రెసు కన్నా ముందు, ఏదీ జ‌ర‌గ‌నేలేదు; రెండోది క్రీ.శ. – ఎప్పుడైతే ప్ర‌తిదీ జ‌రిగిందో.

గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల లో భార‌త‌దేశం అసాధార‌ణ‌మైన‌టువంటి పురోగ‌తి ని చూసింది. అన్ని రంగాల లో.. పెట్టుబ‌డి, ఉక్కు రంగం, స్టార్ట్-అప్ లు, పాలు, ఇంకా వ్య‌వ‌సాయం, విమాన‌యానం.. లో భార‌త‌దేశం సాధించిన పురోగ‌తి గొప్ప‌ది.

మోదీ ని ద్వేషించ‌డం లో, ప్ర‌తిప‌క్షం దేశాన్ని ద్వేషించ‌డం మొద‌లు పెట్టింది. ఈ కార‌ణం గానే వారి నాయ‌కులు లండ‌న్ కు వెళ్తారు; అక్క‌డ భార‌త‌దేశాన్ని అప్ర‌తిష్టాక‌రం గా చాటేలా ప‌త్రికా విలేక‌రుల స‌మావేశాల‌ ను నిర్వ‌హిస్తారు.

వారి ప‌ట్ల నేను చేసిన నేరం ఏమిటో మీకు తెలుసా ? పేద కుటుంబం లో పుట్టిన‌టువంటి ఒక వ్య‌క్తి వారి ఏలుబ‌డి ని స‌వాలు చేస్తున్నాడు.

వారి యొక్క 55 సంవ‌త్స‌రాల హ‌యాం లో పారిశుధ్య ర‌క్ష‌ణ సుమారు 38 శాతం గా ఉండింది. మ‌రి మా యొక్క 55 నెల‌ల పాల‌న లో అది సుమారు 98 శాతాని కి చేరుకొంది. వారి 55 సంవ‌త్స‌రాల పాల‌న కాలం లో గ్యాస్ క‌నెక్ష‌న్ లు 12 కోట్లు గా ఉండ‌గా, గ‌త 55 నెల‌ల్లో ఇవి 13 కోట్లు గా ఉన్నాయి.

మేము మా యొక్క 5 సంవ‌త్స‌రాల కాలం లో ఎంతో వేగం తో కృషి చేశాం. వీటి ని గురించి ఆలోచించండి – కాంగ్రెస్ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ని విధించింది. అయితే, మోదీ సంస్థ ల‌ను ధ్వంసం చేస్తున్నాడు. కాంగ్రెస్ సైన్యాన్ని అవ‌మానించింది. సైన్య ప్ర‌ధానాధికారి ని ఒక గూండా అని పేర్కొంది. కానీ, మోదీ సంస్థ ల‌ను ధ్వంసం చేస్తున్నాడు. భార‌తీయ సేన ఒక తిరుగుబాటు కు ఒడిగ‌డుతోంద‌ని కాంగ్రెస్ నాయ‌కులు క‌థ‌లు అల్లుతారు.. కానీ మోదీ సంస్థ‌ ల‌ను ధ్వంసం చేస్తున్నాడు.

కాంగ్రెస్ ఇసి ని మ‌రియు ఇవిఎం ను ప్ర‌శ్నిస్తుంది. కానీ, మోదీ సంస్థ ల‌ను ధ్వంసం చేస్తున్నాడు. కాంగ్రెస్ న్యాయ వ్య‌వ‌స్థ ను స‌తాయిస్తుంది. కానీ, మోదీ సంస్థ ల‌ను ధ్వంసం చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్ర‌ణాళిక సంఘాన్ని ఒక హాస్యగాళ్ల గుంపు అని అంటుంది. కానీ, మోదీ సంస్థ ల‌ను ధ్వంసం చేస్తున్నాడు.

కాంగ్రెస్ 356వ అధిక‌ర‌ణాన్ని అనేక ప‌ర్యాయాలు దుర్వినియోగ ప‌రుస్తుంది. కానీ, మోదీ సంస్థ ల‌ను ధ్వంసం చేస్తున్నాడు.

భార‌త‌దేశ ప్ర‌జ‌లు ఒక పూర్తి సంఖ్యాధిక్యం క‌లిగిన‌టువంటి ప్ర‌భుత్వం ఏమీ చేయ‌గలుగుతుంద‌నేది గ‌మ‌నించారు. వారు ఎన్‌ డిఎ కృషి ని చూశారు. వారు ఒక ‘మ‌హామిలావ‌ట్’ (महामिलावट) ప్ర‌భుత్వాన్ని.. దేనినైతే కోల్‌కాతా లో గుమికూడిన‌ వారు ఏర్పాటు చేస్తారో.. దాన్ని కోరుకోరు.

సిడ‌బ్ల్యుజి 2010 సంద‌ర్భం గా మ‌న ఆట‌గాళ్ళు భార‌త‌దేశం కోసం ప‌త‌కాల ను గెలుచుకోవ‌డాని కి ఎంతో శ్రమించ సాగారు. కానీ, కాంగ్రెస్ కు మాత్రం కామ‌న్‌వెల్త్ గేమ్స్ అనేవి పార్టీ లోని కొద్ది మంది యొక్క వ్య‌క్తిగ‌త సంప‌ద ను పెంపొందించుకొనేందుకు ల‌భించిన‌టువంటి ఒక అవ‌కాశం.

యుపిఎ యొక్క ఫోన్ బ్యాంకింగ్ వారి నాయ‌కుల స్నేహితుల‌ కు అద్భుతాల ను చేసి పెట్టింది. ఆ విధ‌మైన అభిమాన ప్రదర్శన కార‌ణం గా మ‌న బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ఎన్నో స‌మ‌స్య ల పాలయింది.

ఇండియ‌న్ నేశ‌న‌ల్ కాంగ్రెస్ మ‌న సాయుధ బ‌ల‌గాలు శ‌క్తివంతం కావాల‌ని కోరుకోవ‌డం లేద‌ని పార్ల‌మెంటు స‌భాముఖం గా నేను చెప్ప‌ద‌లుస్తున్నాను. వారు మ‌న భ‌ద్ర‌త యంత్రాంగం దృఢం గా ఉండాల‌ని త‌లచ‌డం లేదు. వారు అంత ల‌జ్జాక‌రం గా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటే, ఏ కంపెనీల కోసం వారు బిడ్ లు వేస్తున్నట్లు ?

డాక్టర్ బాబాసాహెబ్ ఆమ్బేడ్‌క‌ర్‌ ఎల్ల‌ప్పుడూ త‌న కాలాని క‌న్నా ముందు ఉండే వారు. కాంగ్రెస్ లో చేర‌డం ఆత్మహ‌త్య చేసుకోవ‌డం వంటిద‌ని ఆయ‌న అన్నారు.

వేల కొద్దీ సంస్థ లు విదేశాల నుండి నిధుల ను అందుకొంటున్నాయి. ఈ ప్ర‌క్రియ లో పార‌ద‌ర్శ‌క‌త్వం ఉండాల‌ని మేము కోరాము. కానీ, ఈ సంస్థ లు మూత‌ప‌డ్డాయి. ఏ విధ‌మైన జవాబుదారీ లేకుండా అటువంటి డ‌బ్బు త‌ర‌లి రావ‌డానికి ఎందుకు అనుమ‌తి ఇచ్చినట్లు ?

ధ‌ర‌ల పెరుగుద‌ల మ‌రియు కాంగ్రెస్ ఒక జ‌ట్టు గా ఉన్నాయి. కాంగ్రెస్ వ‌చ్చిన‌ప్పుడు, ధ‌ర‌ల కు కూడా రెక్కలు వస్తాయి. ఎన్‌ డిఎ ప్ర‌భుత్వం ధ‌ర‌ల‌ ను అదుపు లో ఉంచ‌డం కోసం కృషి చేసింది.

ఎల్ఇడి ధ‌ర‌ లు యుపిఎ హ‌యాం లో అంత ప్రియం గా ఉండ‌టానికి కార‌ణమేమిటి ?

మా ప్ర‌భుత్వం భార‌త‌దేశ ప్ర‌జ‌ల అభ్యున్న‌తి తో పాటు చ‌క్క‌టి ఆరోగ్యం దిశ గా కృషి చేసింది. స్టెంట్ ల, మోకాలి శ‌స్త్ర చికిత్స‌ ల, ఇంకా మందుల ధ‌ర‌ లు దిగి వ‌స్తున్నాయి. ఇది పేద‌ల లో కెల్లా పేద‌ల కు స‌హాయ‌కారి గా ఉంటోంది.

सितंबर 2017 से लेकर नवंबर 2018 तक यानि करीब-करीब 15 महीने में लगभग 1 करोड़ 80 लाख लोगों ने पहली बार प्रॉविडेंट फंड का पैसा कटाना शुरू किया है। इनमें से भी 64 प्रतिशत 28 साल से कम आयु के हैं।

इसके अलावा एक और तथ्य है। हमारे देश में मार्च 2014 में करीब-करीब 65 लाख लोगों को नेशनल पेंशन सिस्टम (NPS) में रजिस्टर किया गया था। पिछले साल अक्तूबर में ये संख्या बढ़कर करीब 1 करोड़ 20 लाख हो गई है। क्या ये भी बिना नई नौकरी के ही हो गया।

एक और आकड़ा है। हर साल इनकम टैक्स रिटर्न भरते समय, Non-Corporate Taxpayers भी अपनी आय घोषित करते हैं। इन्हें खुद Salary नहीं मिलती, लेकिन ये लोग यहां नियुक्त लोगों को Salary देते हैं।

पिछले चार वर्षों में देश में ऐसे 6 लाख 35 हजार नए प्रोफेशनल्स जुड़े। क्या आपको लगता है कि एक डॉक्टर ने अपना क्लिनिक या नर्सिंग होम खोला है, तो उसने सिर्फ एक व्यक्ति को ही नौकरी दी होगी, या कोई चार्टर्ड अकाउंटेंट सिर्फ एक व्यक्ति को नौकरी पर रखकर अपना दफ्तर चला रहा होगा? नहीं।

हज़ारों करोड़ रुपए की लागत से 99 लटकी पड़ी सिंचाई परियोजनाओं को पूरा किया जा रहा है:

భార‌త‌దేశం ఇజ్రాయ‌ల్ తో, మ‌రియు పాల‌స్తీనా తో స్నేహం గా మెల‌గుతుంది. భార‌త‌దేశం సౌదీ అరేబియా తో, ఇంకా ఇరాన్ తో స్నేహం గా మెల‌గుతుంది. మా విదేశాంగ విధానం భార‌త‌దేశం యొక్క వాణి ప్ర‌పంచ రంగ‌స్థ‌లం పై బలపడటానికి తోడ్ప‌డింది.

మేము సదా భార‌త‌దేశ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల ను నెర‌వేర్చుతుంటాము.

అహంకారం వారిని 400 నుండి 44 కు తీసుకుపోయింది. దేశం ప‌ట్ల నిబ‌ద్ధ‌త మరియు మా క‌ఠోర శ్ర‌మ లు మ‌మ్మల్ని 2 నుండి 282 కు తీసుకు పోయాయి.

దేశాన్ని దోచుకున్న‌ వారు న‌రేంద్ర మోదీ ని చూసి భ‌య‌ప‌డుతూనే ఉంటారని నేను మీకు హామీ ని ఇస్తున్నాను.

सूरज जायेगा भी तो कहाँ

उसे यहीं रहना होगा

यहीं हमारी सांसों में

हमारी रगों में

हमारे संकल्पों में

हमारे रतजगों में

तुम उदास मत होओ

अब मैं किसी भी सूरज को नही डूबने दूंगा।“