పిఎంఇండియా
పౌరులకు హద్దులను, అడ్డంకులను తొలగించినప్పుడు ఏ సమాజం లేదా దేశం బలం పెరుగుతుందని, ఇది పౌరుల సామర్థ్యాలను పెంచుతుందని, అప్పుడు ఆకాశం కూడా చిన్నదిగా కనిపిస్తుందని శ్రీ మోదీ అన్నారు. గత పాలకులు సృష్టించిన అడ్డంకులను ప్రభుత్వం నిరంతరం తొలగిస్తోందని అంటూ, ఇందుకు అంతరిక్ష రంగాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. మొదట్లో అన్ని అంశాలు ఇస్రో పరిధిలో మాత్రమే ఉండేవని, ఇస్రో ప్రశంసనీయమైన కృషి చేసినప్పటికీ, దేశంలో అంతరిక్ష విజ్ఞానం, వ్యాపార అవకాశాల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేదని, అయితే ఇప్పుడు అంతరిక్ష రంగాన్ని యువ ఆవిష్కర్తలకు తెరిచిన కారణంగా, దేశంలో 250కి పైగా అంతరిక్ష స్టార్టప్‌లు ఏర్పడ్డాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ స్టార్టప్ లు ఇప్పుడు విక్రమ్–ఎస్, అగ్నిబాన్ వంటి రాకెట్లను అభివృద్ధి చేస్తున్నాయని తెలిపారు. భారత్ లో మ్యాప్ లను రూపొందించడానికి గతంలో ప్రభుత్వ అనుమతి అవసరమయ్యే మ్యాపింగ్ సెక్టార్ గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఇప్పుడు ఆ నిబంధన తొలగించిన తర్వాత, జియోస్పేషియల్ మ్యాపింగ్ డేటా కొత్త స్టార్టప్ లకు మార్గం సుగమం చేస్తోందని ఆయన తెలిపారు. అణు ఇంధన రంగం గతంలో వివిధ ఆంక్షలతో ప్రభుత్వ నియంత్రణలో ఉండేదని, ఈ ఏడాది బడ్జెట్ లో ఈ రంగాన్ని ప్రైవేటు రంగానికి తెరిచామని, 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తి సామర్థ్యాన్ని జోడించడానికి ఇది మార్గం సుగమం చేస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వెలిబుచ్చారు.
దేశంలోని గ్రామాల్లో రూ.100 లక్షల కోట్లకు పైగా వినియోగంలోకి రాని ఆర్థిక సామర్ధ్యం ఉందని, ఈ సామర్థ్యం గ్రామాలలోని ఇళ్ల రూపంలో ఉండగా, వీటికి చట్టపరమైన పత్రాలు, సరైన మ్యాపింగ్ లేకపోవడంతో గ్రామస్తులు బ్యాంకు రుణాలను పొందలేకపోతున్నారని ఆయన వివరించారు. ఈ సమస్య భారతదేశానికి మాత్రమే పరిమితం కాదని, అనేక పెద్ద దేశాలలో కూడా అక్కడి పౌరులకు ఆస్తి హక్కులు లేవని ఆయన పేర్కొన్నారు. తమ పౌరులకు ఆస్తి హక్కులు కల్పించే దేశాలు జీడీపీలో గణనీయమైన వృద్ధిని చూస్తున్నాయని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయని అన్నారు. “భారతదేశంలో గ్రామీణ ప్రాంత గృహాలకు ఆస్తి హక్కులు కల్పించడానికి స్వామిత్వ పథకం ప్రారంభమైంది. గ్రామాల్లోని ప్రతి ఇంటిని సర్వే చేయడానికి, మ్యాప్ చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు” అని ప్రధాన మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా ఆస్తి (ప్రాపర్టీ) కార్డులను పంపిణీ చేస్తున్నామని, ఇప్పటికే రెండు కోట్లకు పైగా ప్రాపర్టీ కార్డులు జారీ అయ్యాయని ప్రధానమంత్రి తెలిపారు. గతంలో ప్రాపర్టీ కార్డులు లేకపోవడం వల్ల గ్రామాల్లో అనేక వివాదాలు, కోర్టు కేసులు ఉండేవని, వాటిని ఇప్పుడు పరిష్కరించామని తెలిపారు. ఈ ప్రాపర్టీ కార్డులను ఉపయోగించి ఇప్పుడు గ్రామస్తులు బ్యాంకు రుణాలు పొందగలుగుతున్నారని, తద్వారా వారు వ్యాపారాలు ప్రారంభించడానికి, స్వయం ఉపాధి పొందడానికి వీలవుతోందని ఆయన పేర్కొన్నారు.
తాను పేర్కొన్న ఈ మార్పుల నుంచి అత్యధిక లాభం పొందుతున్నవారు దేశ యువతేనని శ్రీ మోదీ తెలిపారు. “వికసిత భారత్ లో యువతే అతి పెద్ద భాగస్వాములు. వారు ఈరోజు భారతదేశపు ఎక్స్ –ఫాక్టర్. ఇక్కడ ఎక్స్ అంటే ప్రయోగాలు,ప్రతిభ, విస్తరణకు సంకేతం“ అని ప్రధానమంత్రి వివరించారు. పాత పద్ధతులను దాటి, ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించడం ద్వారా, 140 కోట్ల మంది భారతీయులకు ఆవిష్కరణలను పెంచడం ద్వారా యువత కొత్త మార్గాలను సృష్టించిందని ఆయన వివరించారు. దేశంలోని ప్రధాన సమస్యలకు యువత పరిష్కారాలను అందించగలదని, అయితే ఈ సామర్థ్యాన్ని ఇంతకు ముందు ఉపయోగించుకోలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ను నిర్వహిస్తోందని, ఇప్పటి వరకు 10 లక్షలమంది యువత పాల్గొన్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు పరిపాలనకు సంబంధించిన అనేక సమస్యలను ఈ యువ భాగస్వాములకు అందించాయని, వారు సుమారు 2,500 పరిష్కారాలను అభివృద్ధి చేశారని శ్రీ మోదీ తెలిపారు. హ్యాకథాన్ సంస్కృతిని రిపబ్లిక్ టీవీ కూడా ప్రోత్సహిస్తుండటం తనకు ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
” గడచిన దశాబ్దంలో, దేశం కొత్త తరం పాలనను అనుభవించింది, ప్రభావం లేని పరిపాలనను ప్రభావవంతమైన పాలనగా మార్చింది” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. గతంలో ఈ పథకాలు ఉన్నప్పటికీ తొలిసారిగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నామని ప్రజలు తరచూ చెబుతున్నారని ఆయన అన్నారు. ఇప్పుడున్న తేడా చివరి లబ్దిదారు వరకు సేవలు చేరడమే అని ఆయన అన్నారు. గతంలో పేదల కోసం ఇళ్లు కేవలం కాగితాలపై మంజూరు అయ్యేవని, కానీ ఇప్పుడు వాటిని నిజంగా నిర్మిస్తున్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మొత్తం ప్రభుత్వ నియంత్రణలో ఉండేదని, , డిజైన్, నిర్మాణ సామగ్రి మొదలైన అన్నింటినీ ప్రభుత్వమే నిర్ణయించేదని, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇంటి డిజైన్ ను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించి లబ్ధిదారుడి ఖాతాకు నగదు బదిలీ చేస్తోందని ప్రధాని వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో ఇళ్ల డిజైన్ల కోసం దేశవ్యాప్తంగా పోటీలు నిర్వహించామని, దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో నాణ్యత, వేగం పెరిగిందని ప్రధాని అన్నారు. గతంలో అసంపూర్తి ఇళ్లను అందచేసేవారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం పేదలకు వారు కోరుకున్న విధంగా ఇళ్లను నిర్మించి, నీటి కనెక్షన్లు, ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు, సౌభాగ్య పథకం కింద విద్యుత్ కనెక్షన్లు ఇస్తోందన్నారు. “మేము కేవలం నాలుగు గోడలు కట్టలేదు, ఈ ఇళ్లకు జీవం పోశాం” అని పేర్కొన్నారు.
దేశాభివృద్ధికి జాతీయ భద్రత ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, భద్రతను పెంపొందించడానికి గత దశాబ్దంలో చేసిన గణనీయమైన కృషిని వివరించారు. ఇంతకుముందు టీవీల్లో వరుస బాంబు పేలుళ్ల బ్రేకింగ్ వార్తలు, స్లీపర్ సెల్ నెట్ వర్క్ లపై ప్రత్యేక కార్యక్రమాలు సర్వసాధారణమని, కానీ నేడు టీవీ తెరలపైగానీ, భారత గడ్డపై గానీ ఇలాంటి ఘటనలు లేవని ఆయన అన్నారు. తీవ్రవాదం ఇప్పుడు తుది శ్వాస విడిచిందని, ప్రభావిత జిల్లాల సంఖ్య వందకు పైగా నుంచి రెండు డజన్లకు తగ్గిందని ఆయన చెప్పారు. దేశమే తొలి ప్రాధాన్యం – స్ఫూర్తితో పనిచేయడం, పాలనను క్షేత్రస్థాయికి తీసుకురావడం ద్వారా ఇది సాధ్యమైందన్నారు. ఈ జిల్లాల్లో వేల కిలోమీటర్ల రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, 4జీ మొబైల్ నెట్వర్క్లను అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.ఈ ఫలితాలు ఇప్పుడు అందరూ చూసే స్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
సాహసోపేతమైన ప్రభుత్వ చర్యల కారణంగా నక్సలిజాన్ని అటవీ ప్రాంతాల నుండి పూర్తిగా తరిమికొట్టగలిగారు, కానీ ఇప్పుడు అది పట్టణ కేంద్రాలకు వ్యాపిస్తోందని ఆయన హెచ్చరించారు. “అర్బన్ నక్సల్స్” అనే పేరుతో వేగంగా విస్తరిస్తూ, గతంలో తమను వ్యతిరేకించి భారత వారసత్వంలో పాతుకుపోయిన గాంధేయ భావజాలంతో ప్రేరణ పొందిన రాజకీయ పార్టీల్లోకి ప్రవేశిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అర్బన్ నక్సల్స్ స్వరాలు, భాష ఇప్పుడు ఈ రాజకీయ పార్టీల్లో వినిపిస్తున్నాయని, ఇది వారి లోతైన ఉనికిని సూచిస్తుందని, అర్బన్ నక్సల్స్ భారతదేశ అభివృద్ధి, వారసత్వానికి గట్టి వ్యతిరేకులని ఆయన హెచ్చరించారు. అర్బన్ నక్సల్స్ ను బహిర్గతం చేయడంలో శ్రీ అర్నబ్ గోస్వామి చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి అభివృద్ధిని, వారసత్వాన్ని రెండింటినీ బలోపేతం చేయడం అవసరమని స్పష్టం చేశారు. అర్బన్ నక్సల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
“ప్రతి సవాలును ఎదుర్కోవడం ద్వారా నేటి భారతదేశం కొత్త శిఖరాలకు చేరుకుంటోంది” అని శ్రీ మోదీ అన్నారు, ‘ దేశమే తొలి ప్రాధాన్యం‘ స్ఫూర్తితో రిపబ్లిక్ టీవీ నెట్వర్క్ జర్నలిజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. రిపబ్లిక్ టీవీ జర్నలిజం అభివృద్ధి చెందిన భారతదేశ ఆకాంక్షలను ఉత్తేజపరుస్తూనే ఉంటుందని ఆయన అన్నారు.
Speaking at the Republic Plenary Summit. @republic https://t.co/FoMvM7NHJr
— Narendra Modi (@narendramodi) March 6, 2025
India's achievements and successes have sparked a new wave of hope across the globe. pic.twitter.com/5BQP1f1Yd7
— PMO India (@PMOIndia) March 6, 2025
India is driving global growth today. pic.twitter.com/nTbUOlGD7J
— PMO India (@PMOIndia) March 6, 2025
Today's India thinks big, sets ambitious targets and delivers remarkable results. pic.twitter.com/bj4bhelbGb
— PMO India (@PMOIndia) March 6, 2025
We launched the SVAMITVA Scheme to grant property rights to rural households in India. pic.twitter.com/fvFXbJ8RBL
— PMO India (@PMOIndia) March 6, 2025
Youth is the X-Factor of today's India.
— PMO India (@PMOIndia) March 6, 2025
Here, X stands for Experimentation, Excellence, and Expansion. pic.twitter.com/yZnj76ms8F
In the past decade, we have transformed impact-less administration into impactful governance. pic.twitter.com/Xq3UrYVIGE
— PMO India (@PMOIndia) March 6, 2025
Earlier, construction of houses was government-driven, but we have transformed it into an owner-driven approach. pic.twitter.com/CpfTX9YZqi
— PMO India (@PMOIndia) March 6, 2025
बीते 10 वर्षों में अलग-अलग सेक्टर की बड़ी उपलब्धियां बताती हैं कि भारत आज दुनिया की ग्रोथ को ड्राइव कर रहा है। pic.twitter.com/OkV5VRYx8r
— Narendra Modi (@narendramodi) March 7, 2025
यह मेरे देशवासियों की सोच बदलने का ही परिणाम है कि आज भारत ना केवल बड़े टारगेट तय कर रहा है, बल्कि बड़े नतीजे लाकर भी दिखा रहा है। pic.twitter.com/eNyuX2m5js
— Narendra Modi (@narendramodi) March 7, 2025
हमने विकास के रास्ते की कई रुकावटों को दूर किया है, जिससे देश का पूरा सामर्थ्य देशवासियों के काम आ रहा है। pic.twitter.com/YsBZWSAt2Y
— Narendra Modi (@narendramodi) March 7, 2025
बीते एक दशक में हमारे प्रयासों से किस प्रकार Last mile delivery सुनिश्चित हो रही है, इसके एक नहीं अनेक उदाहरण हैं। pic.twitter.com/csNT5b9iQq
— Narendra Modi (@narendramodi) March 7, 2025
‘विकसित भारत’ के लिए विकास के साथ-साथ विरासत को मजबूत करना भी जरूरी है, इसलिए हमें अर्बन नक्सलियों से सावधान रहना है। pic.twitter.com/Bm3fq4pSHb
— Narendra Modi (@narendramodi) March 7, 2025