Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రిప‌బ్లిక్ టివి స‌మిట్ లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

రిప‌బ్లిక్ టివి స‌మిట్ లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

రిప‌బ్లిక్ టివి స‌మిట్ లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు ముంబ‌యి లో రిప‌బ్లిక్ టివి స‌మిట్ ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ముంబ‌యి లో నిన్న ఆసుప‌త్రి లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదం ఘ‌ట‌న లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయ‌న సంతాపం తెలిపారు.

దేశం గతిశీలంగాను, సమృద్ధ‌ంగాను ఉండాలంటే స‌కారాత్మ‌క‌ వార్త‌లు ఎంతో ముఖ్యం అని ఆయ‌న నొక్కిపలికారు. విజ్ఞాన శాస్త్రం, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు, ఇంకా క్రీడ‌లు, త‌దిత‌ర అనేక రంగాల లో భార‌త‌దేశం మ‌రిన్ని శిఖ‌రాల‌ను అందుకోవ‌ల‌సిన అవసరం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. అదే విధంగా ప్ర‌సార మాధ్య‌మాల రంగాన్నిగురించి కూడా ఆయ‌న ఈ సందర్భం గా పేర్కొన్నారు.

‘‘స‌ర్జింగ్ ఇండియా’’ అనే ప‌దాలు 130 కోట్ల మంది భార‌తీయుల ఉత్సాహానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాయని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

కొన్నేళ్ల కిందట, భార‌త‌దేశం ‘వ్యాపారం చేయ‌డం లో సౌల‌భ్యం’ తాలూకు స్థానాల‌ లో వృద్ధి చెందడాన్ని గాని, అయిదు ట్రిలియ‌న్ డాల‌ర్ విలువ గ‌ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ గా ఆవిర్భ‌వించే దిశ‌ గా దూసుకుపోవ‌డాన్ని గాని ఊహించ‌డ‌మైనా క‌ష్టం గా ఉండేది అని ఆయ‌న అన్నారు. ప్ర‌స్తుతం, నేర కార్య‌క‌లాపాల‌ లో ప్ర‌మేయం క‌లిగిన వారిని ఏ విధం గా పట్టుకొని విచారణకు గురి చేసి త‌గిన న్యాయం చేయ‌డం జ‌రుగుతోందో ఆయ‌న ఉదాహ‌ర‌ణలతో సహా వివ‌రించారు. కేంద్ర ప్ర‌భుత్వం విధానాల ఆధారిత పాల‌న వైపునకు, మార్పు ను అంచనా వేయ‌గ‌లిగిన పార‌ద‌ర్శ‌క విధానాల వైపు న‌కు క‌దులుతోంద‌ని ఆయ‌న వివ‌రించారు. మౌలిక స‌దుపాయాల అభివృద్ధి వేగ‌వంతంగా జ‌రుగుతోంద‌ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్రాజెక్టుల లో పురోగ‌తిని స‌మీక్షించ‌డం కోసం స్వ‌యంగా త‌న అధ్య‌క్ష‌త‌న జ‌రుగుతున్న ‘ప్ర‌గ‌తి’ (PRAGATI) నెల‌వారీ స‌మావేశాల‌ను గురించి కూడా ఆయ‌న ఈ సంద‌ర్భం గా ప్ర‌స్తావించారు. ఈ ప‌ద్ధ‌తి లో 12 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టుల ప‌నుల‌ను వేగ‌వంతం చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

శాస‌నాలు, ఇంకా చ‌ట్టాలు క్రియాశీలం గా అమ‌లులోకి రావ‌ల‌సి ఉంటుంద‌ని ప్ర‌ధాన మంత్రి నొక్కి ప‌లికారు. ఈ సంద‌ర్భం లో ఆయ‌న ఇన్‌సోల్వన్సి అండ్ బ్యాంక్‌ర‌ప్ట‌సీ కోడ్ ను గురించి ప్ర‌స్తావించారు.

భార‌త‌దేశ విదేశీ విధానానికి ప్ర‌స్తుతం దేశ హితం మార్గదర్శకం గా ఉంద‌ని ఆయ‌న అన్నారు. భార‌త‌దేశం యొక్క వాణి ని అంత‌ర్జాతీయ వేదిక‌ల పై వినిపించ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు.

జిఎస్‌టి లో 28 శాతం శ్లాబ్ ను త్వ‌ర‌లో కేవ‌లం విలాస‌వంత‌మైన వ‌స్తువుల వంటి కొన్ని ఎంపిక చేసిన వ‌స్తువుల‌కు ప‌రిమితం చేయ‌డం జ‌రుగుతుంద‌ని శ్రీ న‌రేంద్ర మోదీ సూచ‌న ప్రాయం గా వెల్లడించారు. సామాన్య మాన‌వుడు ఉప‌యోగించే దాదాపు అన్ని వ‌స్తువుల‌తో పాటు మొత్తం వ‌స్తువుల‌లో 99 శాతం వ‌స్తువుల‌ను 18 శాతం లేదా అంత‌క‌న్నా త‌క్కువ జిఎస్ టి శ్లాబు లో ఉంచేటట్టు ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

***